అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఫర్ ఫెక్ట్ మూవీ “లెహరాయి”.. ప్రముఖ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ

166


దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే.., అందమైన కుందానాల బొమ్మరా, రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా,.., పండు వెన్నెల్లో ఈ వెనుగానం అంటూ వ‌చ్చిన సాంగ్స్ ఇప్ప‌టికి వినిపిస్తున్నాయి అంటే ఆ సాంగ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన విధానం అంతా ఇంతా కాదు ఇవొక్క‌టే కాదు సంపంగి, 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రీ రామ చంద్రులు, ప్రేమలో పావని కళ్యాణ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, అవతారం, వైఫ్, అందాల ఓ చిలుక వంటి సినిమాలకు మ్యూజికల్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాతో సంభందం లేకుండా ఆడియో సూప‌ర్‌హిట్ చేయ్య‌ట‌మే కాకుండా అంద‌రూ పాడకునేలా సంగీతాన్ని అందించిన సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ.. జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు తాజాగా “లెహ‌రాయి” చిత్రంతో ప్రేక్షకులకు మళ్ళీ మెస్మరైజ్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్ తో మన ముందుకు రాబోతున్నాడు ..

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంసని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు.ఈ చిత్రంలో మంచి ఫీల్ వున్న 7:పాటలు ఉండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్,“బేబీ ఒసేయ్ బేబీ”సాంగ్,అప్సర అప్సర సాంగ్స్, చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ, ప్రేమ ఊబిలో మునిగి నిన్ను మరచి పోయా వంటి పాటలు మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకున్నాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా “లెహరాయి” చిత్ర సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ..

లెహరాయి సినిమా పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?

చాలా సంతోషంగా ఉంది.అలాగే ఈ సినిమా కు ఒక ప్రత్యేకత ఉంది. సంపంగి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత పేరు వచ్చిందో ఈ లెహరాయి సినిమా మ్యూజిక్ కు అంతే పేరును వస్తుంది. అయితే ఈ సినిమా కొరకు బిగినింగ్ నుంచి స్టోరీ విని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని టీంతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ అన్ని రకాలుగా సెట్ అయిన సినిమానే ఈ “లెహరాయి”.అయితే సంపంగి సినిమాని గుర్తుకు తెచ్చేలా ఈ సినిమా పాటలు అద్భుతంగా కుదిరాయి, పాటలతో పాటు మంచి కథ కూడా కుదరడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు.

ఒక టైమ్ లో మీ పాటలు యూత్ కు మంచి కిక్ ఇచ్చేవి,అయితే మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు?

గ్యాప్ అనేది కెరియర్లో కూడా భాగమే, నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఒక హిట్ వస్తే రెండు సినిమాలు ఫెయిల్ కావడం జరిగేది దాంతో నా కెరీర్ గ్రాఫ్ పెరగలేదు. ఏదైనా ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తే ప్రేక్షకులకు ఆ పాటలు ఎప్పుడూ గుర్తుండి పోవాలని కోరుకునేవాన్ని దాంతో ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ గ్యాప్ తీసుకున్నాను.

ఒకప్పుడు సంపంగి వంటి పాటలు యూత్ ను మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి మళ్ళీ ఆ తరహా పాటలు మీ ద్వారా చూడచ్చా?

తప్పకుండా చూడవచ్చు ఇప్పుడు వస్తున్న “లెహరాయి” పాటలు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో పాటు నెక్స్ట్ రాబోయే నా సినిమాలు కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అవుతాయి. అయితే “సంపంగి” సినిమా హిందూ ముస్లింల మధ్య సాగే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఆ సినిమా లాగే ఇందులో కూడా ప్రస్తుతం లవ్ చేసుకుంటున్న వారిలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆలా ఎందుకు ఆలా జరుగుతుంది అనేది తెలుపుతూ లవ్ తో పాటు ఇంటర్నల్ గా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.ఈ “లెహరాయి” పాటలు సంపంగి సినిమా పాటల కంటే ఒక మెట్టు పైన ఉండేలా ఈ సినిమా పాటలు ఉంటాయి

ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది అయితే మీ స్ట్రెంత్ వచ్చేసి లవ్ సాంగ్స్ బాగా చేస్తారు అని ఉంది.ఈ లెహరాయి మీకు పర్ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చా?

లెహరాయి అంటే ఒక గాలి కెరటం. ఒక ఇంద్రధనస్సు కున్న ఏడు రంగులులాగే ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. లవ్, సెంటిమెంటు, మాస్ ఇలా ఏడు రకాలుగా ఈ సినిమాలో పాటలు ఉంటాయి.ఈ సినిమాకు ఇంత మంచి ఆల్బం రావడానికి ముఖ్య కారణం నిర్మాతలు. సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలని చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.ఇందులో సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, హరిచరణ్, జెస్సి గిప్టన్, సన్నీ హిందూస్థానీ, సాకేత్, రేవంత్ వంటి మెయిన్ సింగర్స్ అంతా కూడా ఈ సినిమాలో పాటలు పాడడం జరిగింది.అలాగే రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి ఇలా పాటల రచయితలు ఇలా మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాకు ఇంత
మంచి ఆల్బం వచ్చిందంటే దీనికంతటికీ వీరే కారణం కాబట్టి ఈ “లెహరాయి” సినిమా నాకు ఫర్ ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చు.

చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్పండి?

దర్శకుడు రామకృష్ణ కొత్త వాడైనా చాలా చక్కగా చేశాడు. సాధారణంగా సీనియర్ యాక్టర్స్ ను డీల్ చేయడం అంటే చాలా కష్టం. రావు రమేష్, సీనియర్ నరేష్, ఆలీ, సత్యం రాజేష్ ఇలా పెద్ద ఆర్టిస్టులను డీల్ చేయడం అంటే ఈజీ కాదు. కానీ దర్శకుడు ఇది కావాలి అనేది చెప్పకనే చెప్తూ అందరితో కలసిపోయి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరితో చాలా బాగా చేయించుకున్నాడు. దాంతో నాకు చాలా ఈజీ అయింది. ఈ పాట ఇలానే ఉండాలని కన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ గా కథనం ప్రకారం గా ప్రతి సన్నివేశానికి దగ్గరగా ఉండేలా చేయించుకున్నాడు.

చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ గురించి చెప్పండి?

నిర్మాత మద్ది రెడ్డి శ్రీనివాస్ సినిమాను పరిపూర్ణంగా చేయించు కున్నాడు.సినిమాలో మంచి క్వాలిటీ ఉండాలని మమ్మల్ని బాగా చూసుకున్నాడు. యూనిట్లో జరిగే ప్రతి ఒక్క పనిని దగ్గర ఉండి చూసుకున్నాడు.తను అలా చేయడం వల్ల చక్కటి అవుట్ పుట్ వచ్చింది.

ప్రతి ఒక్కరూ సిద్ శ్రీ రాం తో పాడించి హిట్ కొడుతున్నారు ఈ సినిమాలో సిద్ శ్రీ రాం పాడిన పాటకు రెస్పాన్స్ ఎలా ఉంది?

లెహరాయి అంటే కెరటం, సిద్ శ్రీ రాం కూడా తన పాటలతో కెరటంలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రతి ఒక్కరూ కోటి రూపాయలతో సినిమా తీసినా హిట్ కోసమే,100 కోట్లు పెట్టిన హిట్ కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాలో కథ తో పాటు మ్యూజిక్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు.అయితే సిద్ శ్రీ రాం చేసిన వరుస 10 సినిమాలు హిట్ సినిమాలే.ఈ సినిమాలో కూడా కథ తో పాటు పాటలు అన్ని చక్కగా కుదిరాయి.

ఈ సినిమా రీ రికార్డింగ్ చూసినపుడు మీరు సినిమా చూసి ఉంటారు కదా సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చింది?

రావు రమేష్, సీనియర్ నరేష్, ఆలీ,సత్యం రాజేష్ వంటి సీనియర్ నటులు చాలా చక్కగా నటించారు. ఈ సినిమా కథ చాలా బాగుంది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా 100% హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. అయితే నాకు మాత్రం సంపంగి లాంటి సినిమానే మళ్లీ వచ్చిందని నేను నమ్ముతున్నాను.

కాలం మారే కొద్ది మ్యూజిక్ కూడా మారుతుంది కాబట్టి మీరు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అప్పటికి ఇప్పటి సంగీతంలో మీరు గమనించిన తేడాలు ఏంటి ?

మ్యూజిక్ లో ఎలాంటి తేడా ఉండదు కానీ కాకపొతే బీట్ ఓరియెంటెడ్ అయ్యారు అంటే రిధం ను ఎక్కువ మింగిలి చేస్తూ చిన్న చిన్న టెక్నిక్స్ తో ఆటో ట్యూన్ కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ మిక్సింగ్ లో కూడా క్రిస్టల్ క్లియర్ ఉండేలా చేయడం జరుగుతుంది. అప్పట్లో సాహిత్యం బాగా వినపడేది అయితే మధ్యలో మ్యూజిక్ హోరు ఎక్కువై సాహిత్యం బాగా డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు మంచి మంచి సింగర్స్ రావడం వలన ఇప్పుడు పాత తరం సాహిత్యానికి ప్రేక్షకులు ఇప్పుడు పీట వేస్తున్నారని చెప్పవచ్చు..

లెహరాయి సినిమా ద్వారా ఆడియన్స్ కు మీరు ఏం చెప్పబోతున్నారు?

ఒకప్పుడు నేను మ్యూజిక్ చేసిన సంపంగి సినిమాను చూసి ఎలా ఆదరించారో.. ఇప్పుడు వస్తున్న “లెహరాయి” సినిమా కూడా అంతకంటే కంటే పెద్ద రేంజ్ లో హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.ఈ సినిమాలో
అన్ని వర్గాల వారికి అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి హృదయాలను కచ్చితంగా తాకుతుంది అని ముగించారు .

నటీనటులు: రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సమర్పకులు : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస
మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ)
డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి
ఫైట్ మాస్టర్ : శంకర్
కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి
రైటర్ : పరుచూరి నరేష్
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్