ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ లాంచ్ చేసిన ఆది సాయికుమార్‌ ‘శ‌శి’ ట్రైల‌ర్‌

411

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ పూర్త‌యింది.

మార్చి 19న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈరోజు ‘శ‌శి’ ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఉత్కంఠ‌భ‌రితంగా ఉంద‌నీ, సినిమా కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌నీ ఆయ‌న అన్నారు. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

“మ‌నం ప్రేమించేవాళ్లు మ‌న ప‌క్క‌న ఉన్న‌ప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు అంతే భ‌యంగా ఉంటుంది” అని హీరో చెప్తుండ‌గా ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. అంత‌లోనే ప్ర‌మాదం జ‌రిగి, అత‌ని ప్రియురాలు హాస్పిట‌ల్ పాల‌యిన‌ట్లు తెలుస్తోంది.

మ‌నం ఏదైనా సాధించాల‌నుకున్న‌ప్పుడు ముందు మ‌న బ‌ల‌హీన‌త‌ల్ని గెల‌వాలి.”, “ప్రేమించినోడితో పెళ్లి చేయ‌కుండా పెళ్లి చేసినోడితో ప్రేమ‌గా ఉంటుంద‌నుకోవ‌డం మీ మూర్ఖ‌త్వం.” అనే డైలాగ్స్‌తో హీరో క్యారెక్టర్ ఏమిట‌నేది ఊహించ‌వ‌చ్చు.

శ‌శి అంటే రెండ‌క్ష‌రాలు కాదు వాడికి. మ‌న‌మిద్ద‌రం. ఏ ఒక్క‌రు లేక‌పోయినా త‌ట్టుకోలేడు.” అని హీరో ల‌వ‌ర్‌తో ఫ్రెండ్ చెప్ప‌డాన్ని బ‌ట్టి హీరోకు ఫ్రెండ్‌, ప్రియురాలు త‌ప్ప లోకంలో ముఖ్య‌మైన విష‌యాలు లేవ‌ని అర్థ‌మ‌వుతుంది. సో.. శ‌శి అంటే ఒక్క‌రు కాద‌నీ, ఇద్ద‌ర‌నీ తెలుస్తోంది.

అప్ప‌టి దాకా ఒక ర‌కం లుక్‌తో ల‌వర్ బాయ్‌లా క‌నిపించిన హీరో, ఆ త‌ర్వాత గ‌డ్డం పెంచేసి భిన్న‌మైన లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. దాని వెనుక ఏదో క‌థ ఉంద‌నీ, అది ఎమోష‌న‌ల్ ఎలిమెంట్‌తో ముడిప‌డి ఉంద‌నీ అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా ‘శ‌శి’ అనేది ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా ట్రైల‌ర్ మ‌న‌కు స్ప‌ష్టం చేస్తోంది.

హీరో క్యారెక్ట‌ర్‌, ఆ క్యారెక్ట‌ర్‌లో ఆది సాయికుమార్ ప‌ర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌ల‌మ‌ని ఈజీగా గ్ర‌హించ‌వ‌చ్చు. ట్రైల‌ర్ చూస్తే, యాక్ష‌న్ సీన్ల‌లోనూ ఆయ‌న విజృంభించి న‌టించిన‌ట్లు క‌నిపిస్తోంది. సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్‌కు కొద‌వ‌లేదు.

సుర‌భి చేసిన హీరోయిన్ క్యారెక్ట‌ర్ కేవ‌లం గ్లామ‌ర్‌కు ప‌రిమిత‌మైంది కాద‌నీ, క‌థ‌కు ఆమె క్యారెక్ట‌ర్ చాలా కీల‌క‌మైంద‌నీ తెలుస్తోంది. ట్రైల‌ర్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, విజువ‌ల్స్‌తో పాటు యాక్ష‌న్ సీన్లు కూడా ఇంప్రెసివ్‌గా అనిపిస్తున్నాయి.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ, “‌ఈరోజు ‘శ‌శి’ ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఆయ‌న‌కు థాంక్స్‌. ‘శ‌శి’ ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం” అన్నారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ చేతుల మీదుగా ‘శ‌శి’ టీజ‌ర్ రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదివ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింద‌న్నారు.

తారాగ‌ణం:
ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి.

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు
సినిమాటోగ్రీఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
ఎడిటింగ్‌: స‌త్య జి.
డైలాగ్స్‌: ఐ. ర‌వి
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: రాఘ‌వ చౌద‌రి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385