కార్తికేయ, చావు క‌బురు చ‌ల్ల‌గా “ఫిక్స్ అయిపో” పాట‌కు అనూహ్య స్పంద‌న‌

512

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గాస‌. ఇటీవ‌లే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో 75 ల‌క్ష‌లకి పైగా వ్యూస్ తెచ్చుకోవ‌డం విశేషం. ఇక మార్చి 9న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున ముఖ్య అతిధిగా జ‌రిగిన చావు క‌బురు చ‌ల్ల‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన హైలెట్స్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా అంత‌టా ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి ఫిక్స్ అయిపో అనే క్యాచీ నెంబ‌ర్ ని విడుద‌ల చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన ఈ పాటను ప్ర‌ముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ పాడారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న వస్తుంది. మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమా కూడా వచ్చింది అని తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం..

స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీ వాసు
దర్శకుడు – కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ – జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ – జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ – క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ – శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ – రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరిక‌ల్ వీడియోస్ – క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ – మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ – మౌనా గుమ్మ‌డి


Thanks & Regards,
Eluru Sreenu
P.R.O