సందీప్ కిష‌న్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్‌`

566

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.
ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను
నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌: హిప్ హాప్ త‌మిళ‌