వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా “అసలు ఏం జరిగిందంటే” ఫస్ట్ లుక్ లాంచ్

1146

బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన మహేంద్రన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “అసలు ఏం జరిగిందంటే”. సూపర్ స్టార్ రజినీకాంత్, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో వైవిధ్యమైన పాత్రల్లో నవ్వులు పండించాడు మహేంద్రన్. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్ ఫిల్మ్స్ బ్యానర్, నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో అత్యంత బిజీ హీరోగా ఏన్నో అత్యద్భుతమైన పాత్రల్ని పోషించిన విజయ్ సేతుపతి ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ తనదైన శైలిలో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వెర్సటైల్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి “అసలు ఏం జరిగిందంటే” ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ…. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా “అసలు ఏం జరిగిందంటే” చిత్రం ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసినందుకు విజయ్ సేతుపతి గారికి మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలనటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో మనల్ని ఎంటర్ టైన్ చేసిన మహేంద్రన్ నా దర్శకత్వంలో తెరకెక్కిన అసలు ఏం జరిగిందంటే చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ఈ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, హరితేజ, షఫి, ఫణి, షాని, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్షీస్ ఎన్టీఆర్ సినిమా లో ఎన్టీఆర్ గా చేసిన విజయ్ కుమార్ గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కర్ణ సినిమాటోగ్రఫీ విజువల్ బ్యూటీ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేస్తాం. అని అన్నారు.

నటీనటులు
మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, హరితేజ, షఫి, ఫణి, షాని, విజయ్ కుమార్, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్, నిర్మాణం – జి.ఎస్.ఫిల్మ్స్
రచన, దర్శకత్వం – శ్రీనివాస్ బండారి
సినిమాటోగ్రఫీ – కర్ణ
మ్యూజిక్, లిరిక్స్ – చరణ్ అర్జున్
ఎడిటర్ – ప్రతాప్
డి.ఐ కలరిస్ట్ – రత్నాకర్ రెడ్డి
సహ నిర్మాతలు – మల్లేశం.వి, సుజాత.ఎం, రాజేష్.బి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – షాని సోల్మన్
ఆర్ట్ – ప్రసాద్
స్టంట్స్ – వాసు