చాలా గ్రాండ్ గా సాగిన సోదరా సాంగ్ లాంచ్ ఈవెంట్. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసి మంచు మనోజ్ సాంగ్ లాంచ్ చేశారు. అలాగే ఈవెంట్లో మూవీ టీం హీరోలు సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి, ప్రొడ్యూసర్ చంద్ర చగంలా, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు మరియు ప్రొడ్యూసర్ శివన్ కుమార్ గారు ఈవెంట్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ గారు మాట్లాడుతూ : ఈ సోదరా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. డార్లింగ్ సంపు అండ్ స్మైల్ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా హార్ట్ ఫుల్ గా ఉంటుంది. సంపూర్ణేష్ ని చూస్తే 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా సోదరుడు ప్రసాద్ ఆయన కోల్పోయాను ఆయన నవ్వు స్వచ్ఛంగా ఉంటుంది అలాగే సంపూర్ణేష్ బాబు నవ్వు కూడా స్వచ్చంగా అనిపిస్తుంది నాకు ఆయనే గుర్తొస్తాడు. సంజోష్ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రొడ్యూసర్లు వాళ్ళు పడిన కష్టం ఈ సినిమాలో తెలుస్తుంది ఈ సినిమా అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ : నా సొంత సోదరుడిలా భావించే మంచు మనోజ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కరెంటు తీగ సినిమా చేసినప్పటి నుంచి ఆయనతో అనుబంధం కొనసాగుతుంది అప్పటినుంచి నన్ను ఒక సొంత సోదరుడిలా భావించారు. అలాగే ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతోంది. ఈవెంట్ కొచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేసిన మంచి మనోజ్ గారు కృతజ్ఞతలు అన్నారు.
సంజోష్ మాట్లాడుతూ : అన్నంటే దోస్తే సోదరా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మంచి మనోజ్ గారి కృతజ్ఞతలు. షూటింగ్ బిజీలో ఉండి కూడా మా కోసం ఒక రోజుని ఇచ్చి ఈవెంట్ కి వచ్చారు. అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత చంద్ర చాగంల మాట్లాడుతూ : ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మంచు మనోజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని అలాగే సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి : అన్నంటే దోస్తే సోదరా సాంగ్ రాసింది సుద్దాల అశోక్ తేజ గారు ఆయన పాట రాసేటప్పుడు ఎంతో కనెక్ట్ అయ్యారు అలాగే అప్పుడే చెప్పారు ఈ పాట మంచి సక్సెస్ అవుతుందని అండ్ ఈ సినిమాకి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. ఈ సినిమా అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని అద్దం పట్టేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంచు మనోజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను
కథ మరియు దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి
సంగీతం: సునీల్ కశ్య ప్
డిఓపి: జాన్
ఎడిటర్: శివశర్వాణి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి
ప్రొడ్యూసర్: చంద్ర చగంలా
నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను
Eluru Sreenu
P.R.O