పుడింగి నెంబర్‌ 1’గా బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు..

847

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్నతాజా చిత్రానికి ‘పుడింగి నెంబర్‌ 1’ అని టైటిల్ కన్ఫార్మ్‌ చేశారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా విద్యుత్‌లేఖరామన్, సాఫీ కౌర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘనంగా జరిగింది. ముహూర్త‌పు స‌న్నివేశాని‌కి ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ రోజు నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా

దర్శకుడు మీరావలి మాట్లాడుతూ –‘‘ కథ అద్భుతంగా వచ్చింది. ఏం టైటిల్‌ పెట్టాలా? అనుకున్నాం. ఫైనల్‌గా ‘పుడింగి నెం 1’ అనే టైటిల్ కన్‌ఫ‌ర్మ్ చేశాం. ‌ఈ కథకు హీరోగా ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తున్నప్పుడు నాకు రజనీకాంత్‌గారు గుర్తొచ్చారు. మన ఫస్ట్‌ సినిమాకే రజనీకాంత్‌ ఏంటి? అనుకున్నాను. మనకు ఎన్ని ఫీలింగ్స్‌ అయిన ఉండొచ్చు. ఎంత ఇమాజినేషన్‌ అయినాఉండొచ్చు. మనమెంటో మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్నాను. సంపూర్ణేష్‌బాబు గుర్తు వచ్చారు. పుండింగి నెంబర్‌ 1గా నేను సంపూర్ణేష్‌బాబును ఫీలయ్యాను. డీఓపీ అనిల్‌ అన్న ద్వారా సంపూకి కథ చెప్పాను. సరే అన్నారు. నా అదృష్టం కొద్ది మంచి ఫ్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌ దొరికారు. సంపూ–బుజ్జమ్మ (విద్యత్‌లేఖరామ్మన్‌) కాంబినేషన్‌ అదిరిపోతుంది. మరొక హీరోయిన్‌గా సాఫీకౌర్‌ను అనుకున్నాం. సంపూ, సాఫీల కాంబినేషన్‌ అదిరిపోతుంది. పోసానిగారికి థ్యాంక్స్‌. మమ్మల్నీ ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఏస్‌ రామారావుగారికి, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

చిత్ర నిర్మాతలు కె. శ్రీ‌నివాస రావు, కె. సుధీర్ కుమార్ మాట్లాడుతూ -“ పుడింగి టైటిల్‌లోనే ఫన్నీనెస్‌ ఉంది. కథ విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాం. డైరెక్టర్‌ మంచి నటీనటులను ఎంచుకున్నారు. మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్న పోసాని, అజయ్‌ఘోష్‌లకు ధన్యవాదాలు. నేటి నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ నెలలో 17 రోజుల షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. మిగిలిన షూటింగ్‌ మే నెలలో పూర్తి చేస్తాం. జూలైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము.“ అన్నారు.

హీరోయిన్‌ విద్యుత్‌లేఖ రామన్‌ మాట్లాడుతూ – ‘‘ నేను వెయిట్‌లాస్‌ అయినప్పుడు అనుకున్నాను మంచి లీడ్‌ రోల్‌ దొరకాలని. హీరోతో పాటు హీరోయిన్‌గా నేను కూడా పోస్టర్‌లో ఉండాలనుకున్నాను. ఓ డైరెక్టర్‌ కాల్‌ చేసి నన్ను ఓ లీడ్‌ రోల్‌ చేయమన్నారు. . ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన మీరాగారికి ధన్యవాదాలు. ఆడియన్స్‌ అందరికి ఈ సినిమా నచ్చుతుంది.“ అన్నారు.

సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ –‘‘ మీరావ‌ళిగారితో నేను 2ఇయర్స్‌గా ట్రావెల్‌ అవుతున్నాను. డైరెక్టర్ మీరాగారిలో మంచి కసి ఉంది. నాలాంటి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఎస్‌రామారావుగారికి, దర్శకులు భీమనేని శ్రీనివాస రావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు.

హీరోయిన్‌ సాఫీకౌర్‌ మాట్లాడుతూ – “తెలుగులో నేను నటించనున్న తొలి తెలుగు సినిమా ఇది. సంపూర్ణేష్‌బాబుగారితో నేను సినిమా చేయనున్నానని తెలిసి నా ఫ్రెండ్స్‌ చాలామంది నాకు కాల్స్‌ చేశారు. వారందరికి హృదయాకాలేయం సినిమా చూశారు. సంపూగారి వీడియోస్‌ చాలా ట్రెండ్‌ అవు తుంటాయి. షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు.