కాశ్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ చేతికి ‘రుద్రతాండవం’ తెలుగు రైట్స్

334


రిషి రిచర్డ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో జి.ఎమ్. ఫిల్మ్ కార్పొరేషన్, 7జి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన తమిళ చిత్రం ‘రుద్రతాండవం’. మోహన్. జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల కోలీవుడ్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్ర తెలుగు హక్కులను కాశ్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నిర్మాతలు కె. కిరణ్, విజయ్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. త్వరలో టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరోతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.