గ్లామర్ షో కు దూరమే: రష్మిక

562

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`లో గొప్ప ఛాన్స్ దక్కించుకున్న కన్నడ భామ రష్మిక ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో పరుగెడుతోంది. ఇప్పటివరకు రష్మిక తెలుగులో చేసిన `ఛలో`,`గీతగోవిందం`,`డియర్ కామ్రేడ్` వంటి సినిమాల్లో ఆమెకు హీరోతో సమానమైన పాత్రలు దక్కాయి. పాటలు, గ్లామర్ షోకు మాత్రమే పరిమితమైపోకుండా రష్మిక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాను పూర్తి కమర్షియల్ సినిమాలకు చాలా దూరమని చెప్పింది. ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్దరూ ముఖ్యమే. అలా ఉంటేనే సినిమా బాగుంటుంది. అయితే కమర్షియల్ సినిమాల్లో మాత్రం హీరోయిన్ పాత్ర బొమ్మలాగే ఉంటుంది. కమర్షియల్ చిత్రాల్లో నటించమని తమిళం నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి సినిమాల్లో నటించేందుకు నేను సిద్ధంగా లేను. సినిమాల సంఖ్య కంటే ఎలాంటి సినిమాల్లో నటించామనేదే నాకు ముఖ్యం. పాటల కోసమే హీరోయిన్ అనే సినిమాల్లో నేను నటించను.