‘రంగ రంగ వైభవంగా..’ నుంచి ‘తెలుసా తెలుసా..’ పాట రిలీజ్.. పాటకు అమేజింగ్ రెస్పాన్స్

427

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా..’. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ టీజర్‌, టైటిల్‌కి ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా బ‌ట‌ర్ ఫ్లై కిస్ కాన్సెప్ట్ యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. అలాగే గురువారం ‘తెలుసా తెలుసా…’ అనే పాట విడుదలైంది.

తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారోస అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. శ్రీమణి సాహిత్యం రాశారు. శంకర్‌ మహదేవన్‌ గొంతులో ఆకట్టుకుంటోంది పాట. యూట్యూబ్‌లో లిరికల్‌ సాంగ్‌ మధ్యలో వచ్చే ఆన్‌ లొకేషన్‌ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. వైష్ణ‌వ్ తేజ్ రంగ రంగ వైభవంగా ఆన్‌ లొకేషన్ విజువల్స్‌లో లుక్ పరంగా ఆక‌ట్టుకుంటున్నారు.

యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రంగ రంగ వైభ‌వంగా సినిమాను ఉంటుంద‌ని మేక‌ర్స్ తెలిపారు. సినిమా బాగా వ‌స్తుంద‌ని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుందని డైరక్టర్‌ గిరీశాయ (త‌మిళంలో అర్జున రెడ్డి ద‌ర్శ‌కుడు) పేర్కొన్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఆయన రూపొందిస్తోన్న రంగ రంగ వైభవంగా సినిమాకు శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.