పూరి జగన్నాథ్ చేతుల మీదుగా “రణస్థలం”ట్రైలర్ విడుదల

644

సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”.ఈ చిత్ర ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా నేడు హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కావలి రాజు, దర్శకుడు ఆది అరవల , సంగీత దర్శకుడు రాజకీరణ్, కెమెరా మెన్ ప్రభాకర్,పబ్లిసిటీ డిజైనర్ సాబీర్ తదితరులుపాల్గొన్నారు.ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ’ ” ఆది నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాలు పని చేసాడు. తను రాజు హీరోగా రణస్థలం మూవీ చేయడం ఆనందం గా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటు ,ఈ టీం మొత్తానిక అల్ ద బెస్ట్ చెబుతున్నాను ” అన్నారు.చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ” మా గురువు గారు పూరి జగన్నాథ్ గారి చేతుల మీదుగా మా సినిమా టైలర్ రిలీజ్ జరగడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. ఈ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ .మా చిత్రం డిఫనెట్ గా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ’ మా సినిమా ఫస్ట్ లుక్ ను మంచి మనసున్న పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేయడం ఆనందం గా ఉంది. ఈ సందర్భంగా పూరి సార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సినిమాకు మా కెమెరా మెన్ ప్రభాకర్, సంగీత దర్శకులు రాజకీరణ్ , మా డిజైనర్ సాబీర్ లు చక్కటి అవుట్ ఫుట్ ఇచ్చారు.అన్నారు. ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం.. నెక్స్ట్ మంత్ఎండింగ్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు.రాజ్, షాలు, సత్యంరాజేశ్, ఛత్రపతి శేఖర్, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, మేఘన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రాజకీరణ్, కెమెరా:ప్రభాకర్, ఎడిటర్:ఎమ్ ఆర్ వర్మ, లి రిక్స్:ఎం.రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, వించున్ అంజి, డాన్సు:పాల్ ,విగ్నేష్, ఆర్ట్:సుభాష్ నాని పి.ఆర్. ఓ:బి.వీరబాబు, నిర్మాత:కావాలి రాజు, కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆది అరవల.