తెలుగు వారు గర్వించే లెజెండ్ కృష్ణ వేణి ” ఆకృతి “ఆధ్వర్యంలో 24 న కృష్ణ వేణి శత వసంత మహోత్సవం ( 100 రోజుల పండుగ)

115

ఆమె ఓ అపురూపమైన, అందమైన నటి, కమ్మని కంఠం తో పాడగల మధుర గాయని. నిర్మాణ బాధ్యతలు మోసిన నిర్మాత.. స్టూడియో అధినేత గా అనుభవం.. ఆమే కృష్ణ వేణి..

నటి గా , గాయని గా, నిర్మాత గా, స్టూడియో అధినేత గా పలు బాధ్యతలు చేపట్టిన కృష్ణ వేణి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించే సినీ విదుషీమణి అన్నారు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ చెంబర్ కార్యదర్శి టీ. ప్రసన్నకుమార్..
శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చేంబర్ లో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి అధ్యక్షుడు సుధాకర్ , నిర్మాత అనురాధా దేవి, సీనియర్ పాత్రికేయులు భగీరథ తో కలిసి పాత్రికేయ మీడియా సమావేశం లో ఆయన ప్రసంగించారు..ఆకృతి ఆధ్వర్యంలో, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సౌజన్యంతో డిసెంబర్ 24 న నిర్వహించే ” కృష్ణవేణి శత వసంత మాహోస్తవానికి” సబందించిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరించి ప్రసన్నకుమార్ ప్రసంగించారు. ఎన్టీఆర్ లాంటి మహా నటుడుకి మన దేశం మొదటి అవకాశం గా వేషం ఇచ్చారన్నారు.. అంతే కాదు మహానటులు ఎన్టీఆర్,
ఏయన్నార్ ను కలిపి మొదటి సారి గా పల్లెటూరి పిల్ల నిర్మించారని అన్నారు. మహా నటులు ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, అంజలీ దేవి, తో పాటు సంగీత దర్శకుడు గా ఘంటసాలను మొదటి సారి పరిచయం చేసిన ఘనత ఆమెది అంటూ ప్రస్తుతించారు.. ప్రముఖ పాత్రికేయులు భగీరథ ప్రసంగిస్తూ 1936 నట జీవితం లో మొదటిసారి ప్రవేశించిన కృష్ణ వేణి తొలితరం హీరోయిన్ అంటూ కొనియాడారు.. ఆమె వంద సంవత్సరాల పండుగ ముందుగా తలపెట్టిన ఘనత ఆకృతికి దక్కుతుంది అన్నారు. కృష్ణ వేణి కూతురు నిర్మాత ఎన్ ఆర్ అనూరాధ దేవి మాట్లాడుతూ అమ్మ క్రమశిక్షణ ఆమెను ఉన్నత స్థానం లో నిలబెట్టింది అన్నారు..
ఆకృతి సుధాకర్ వివరిస్తూ ఈనెల 24 న ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ఆకృతి నిర్వహించే ఈ కార్య క్రమం లో ముఖ్య అతిథులు గా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, టూరిజం ,సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు.. కార్య క్రమానికి సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహిస్తారు.ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ తో పాటు సినీ ప్రముఖులు మురళీ మోహన్, బ్రహ్మానందం, జయసుధ, రోజారమని, తెలంగాణ రాష్ట్ర పిసిసి ఎస్. సి డిపార్ట్మెంట్ చైర్మన్ నగరి గారి ప్రీతమ్ , మున్నగు వారు పాల్గొంటారన్నారు..