రణస్థలం” ఆడియో ఆవిష్కరణ.

726

సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్,షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”.ఈ చిత్రం ఆడియోను నిర్మాత అమ్మగారైన శ్రీ మతి కావాలి సంతోషమ్మ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్,హీరోయిన్స్ మేఘన,జరాఖాన్,సంగీతదర్శకుడు రాజకిరణ్,కో డైరెక్టర్ శ్రీరామ్,ఆర్టిస్ట్ కనకదుర్గ అప్పారెడ్డి గూడా గ్రామా పెద్దలు వ్లకే బుచ్చయ్య,చేగూరు రాజు,భవాని శ్రీనివాస్,వ్లకే వెంకటేష్,చెక్కల శ్రీశైలం (షాద్ నగర్) మరియు కేశిరెడ్డి పల్లి గ్రామా పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరో,నిర్మాత అయిన కావాలి రాజ్ మాట్లాడుతూ.ఈ చిత్రం షూటింగ్ టైములో చాల కష్టాలుపడ్డాను మా అమ్మగారు సంతోషమ్మ ఆశీస్సులతో ధైర్యంగా పూర్తిచేయగలిగాను.ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం.ఈ చిత్రం చాల అద్భుతంగా వచ్చింది తప్పకుండ విజయం సాధిస్తుంది ఈ నెల 22 విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు.
చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమా కి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.సంగీత దర్శకుడు రాజకీరణ్ వ్యాక్యతగా వ్యవహరించిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయింది.రాజ్, షాలు, సత్యంరాజేశ్, ఛత్రపతి శేఖర్, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, మేఘన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రాజకీరణ్, కెమెరా:ప్రభాకర్, ఎడిటర్:ఎమ్ ఆర్ వర్మ, లిరిక్స్:ఎం.రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్,వించున్ అంజి, డాన్సు:పాల్ ,విగ్నేష్, ఆర్ట్:సుభాష్ నాని,పి.ఆర్. ఓ:బి.వీరబాబు,నిర్మాత:కావాలి రాజు,కధ, స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ఆది అరవల.