న్యూ ఇయర్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదల

490

యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత‌ వెంకట్‌ తలారి.

న్యూ ఇయర్ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు

సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌, సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.