‘రామారావు ఆన్ డ్యూటీ’ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదల

745

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ‘ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హైదరాబద్ లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అభిమానుల కోలాహం మధ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శరత్ మండవ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సుదీర్ వర్మ, త్రినాథ రావ్ నక్కిన , వంశీ, కళ్యాణ్ చక్రవర్తి, సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ గారు వుండటం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి వారిని చాలా మందిని ఆయన పరిచయం చేశారు. కొత్త ఆలోచనలు వినడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. నా టీం అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. 29 న అందరూ థియేటర్ కి రండి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ మిమ్మల్ని అన్ని రకాలుగా అలరిస్తుంది” అన్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అభిమానులకు, అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385