రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు సూపర్ , అయిన విషయం అందరికీ తెలిసిందే..! మళ్ళీ ఆ సిరీస్ లో భాగంగా రాజుగారి గది-3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు టాలెంటెడ్ దర్శకుడు ఓంకార్. అశ్విన్ బాబు కథానాయకుడిగా అవికా గోర్ హీరోయిన్ గా ఓంకార్ స్వీయ దర్శకత్వంలో ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తోన్న చిత్రం “రాజుగారి గది-3”. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా.. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియా వారికీ ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రంలో హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ అవికా గోర్, నటులు ఆలీ, బ్రహ్మజీ, అజయ్ గోష్, దర్శకుడు ఓంకార్, కెమెరామెన్ చోటా కే.నాయుడు, ఎడిటర్ గౌతమ్ రాజు, సంగీత దర్శకుడు షబీర్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, కొరియో గ్రాఫర్స్ శేఖర్, శివ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. నన్ను సరికొత్త కోణంలో ఆవిష్కరించింది మా అన్నయ ఓంకార్. ఒక రూపాయికి మూడొంతులు ఎంజాయ్ చేస్తారు. దసరా హిట్ గా మా చిత్రం ఉండాలని కోరుకుంటున్నాం. సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో కలిసి పనిచేసినందుకు చాలా హ్యాపీగా వుంది.. అన్నారు. .
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. కానీ రాజుగారి గది-2 లో కామిడీ మిస్ అయిందని కామెంట్స్ వచ్చాయి. అవన్నీ ఫుల్ ఫిల్ చేస్తూ.. ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడే దసరా రిలీజ్ అనుకున్నాం. జూన్ లో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కల్లా.. రెండు నెలల్లో ఫినిష్ చేసాం అంటే దానికి కారణం చోటా కె.నాయుడు గారు. ది బెస్ట్ క్వాలిటీతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాం. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, షబ్బీర్ మ్యూజిక్ వండర్ఫుల్ గా ఇచ్చారు.