బిగింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూ.. ఎంజాయ్ చేస్తారు..టీజర్ లాంచ్ లో హీరో సందీప్ కిషన్

543

‘నిను వీడని నీడను నేనే’ వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “తెనాలి రామకృష్ణ బి,ఏ,బి,ఎల్”. హన్సిక మోత్వానీ హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది. శ్రీ నీలకంటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ హన్సిక మోత్వానీ, దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి, నటులు అనంత్, అశోక్ కుమార్, గిరిధర్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎడిటర్ చోట కె.ప్రసాద్, మాటల రచయితలు భవానీ ప్రసాద్, నివాస్, ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్ సీతారామరాజు మల్లెల, సహా- నిర్మాతలు రూపా జగదీశ్, ఇందుమూరి శ్రీనివాసులు, చిత్ర నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.. అనంతరం సందీప్ కిషన్, హన్సిక సంయుక్తగా తెనాలి రామకృష్ణ టీజర్ ను రిలీజ్ చేసారు.
నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది!!
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ రెడ్డి మీద వున్న నమ్మకంతో అతని స్నేహితులు ఈ చిత్రాన్ని నిర్మించినందుకు వారికి నా థాంక్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఫస్ట్ టైం సిన్సియర్ గా నా పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు నాగేశ్వర్
నా స్నేహితులకి నేను ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా!!
దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీజర్ ని మేమంతా చాలా సార్లు చూసుకున్నాం. మాకు బాగా నచ్చింది. కానీ చోటా కె.నాయుడు గారు సడన్ సర్ప్రైజ్ తో వేదిక మీదకు వచ్చి మా టీజర్ అదిరిపోయింది, సూపర్బ్ గా వుంది అని, చెప్పడం చాలా హ్యాపీగా వుంది. ఆయన మాటలు ఒక ఎనర్జీ నిచ్చాయి. ఇదే స్పూర్తితో ఇంకా ముందుకు వెళ్తాము. దేనికైనా రెడీ సినిమా తర్వాత హన్సికతో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. అంత సపోర్టివ్ గా వర్క్ చేస్తుంది. రాజసింహ మంచి పాయింట్ ఇచ్చాడు. దానిని మా రైటర్స్ అందరు బాగా డెవలప్ చేసి మంచి స్క్రిప్ట్ తయారు చేశాం. మా నిర్మాతలందరూ నాకు ఎంతో హెల్ప్ చేసారు. వారికి మంచి సినిమా చెయ్యాలని ఈ సినిమా చేసి గిఫ్టుగా ఇస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.. అన్నారు.