త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ దేశం’. ‘శ్రీ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి మార్కులు పడ్డాయి. డిసెంబర్ 2న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించనున్న అలనాటి హీరోయిన్ మధుబాల మీడియాతో ముచ్చటించారు…
నేను ఇది వరకు చాలా వరకు తల్లి పాత్రలు పోషించాను. ఇప్పుడు హీరోయిన్గా చేయలేను కాబట్టి తల్లి పాత్రలు వస్తాయి. ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పదే పదే నన్ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్ని సార్లు ప్రయత్నాలు చేస్తున్నారు కదా? నేను చేయాలని ఫిక్స్ అయ్యా. తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. ప్రేమ దేశం అనే టైటిల్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. హీరోయిన్గా చేసినప్పుడు అంతే.. ఇప్పుడు కూడా అంతే. కానీ దాన్ని నేను కాంపిటీషన్లా ఎప్పుడూ చూడను. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలు వస్తాయి.
సుహాసిని, చారు హాసన్ ఇలా అందరూ కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. అలా మాకు కూడా ఫ్యామిలీ అంతా కలిసి నటించాలని ఉంది. కానీ సరైన కథ దొరకాలి. అయితే ఆ ప్రాజెక్ట్ను మాత్రం మేం నిర్మించం. కేవలం నటించాలని మాత్రమే ఉంది.
ప్రేమ దేశం సినిమాలో నేను కూడా ఒక హీరోయిన్లాంటి పాత్రలోనే కనిపిస్తాను. ఈ చిత్రంలో మ్యూజిక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద సినిమాలు, నెగెటివ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను.
నేను బయట చాలా ఫన్నీగా ఉంటాను. ప్రేమ దేశంలో సినిమాలో నా పాత్ర కామెడీ యాంగిల్లో ఉండదు. కానీ తమిళ్లో నేను స్వీట్ కార్న్ కాఫీ అనే వెబ్ సిరీస్లో ఫుల్ కామెడీ రోల్ చేశాను. నేను మామూలుగానే సరదాగా ఉంటాను. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అన్నారు. నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని ఉంది.
త్రిగుణ్ నాకు అదిత్లానే తెలుసు. ఫస్ట్ సీన్ అతనితోనే ఉంది. కొత్త దర్శకుడు, కొత్త కథ ఎలా కలిసిపోవాలని అనుకుంటూ ఉన్నాను. అదిత్ పర్ఫామెన్స్ చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంతో సహజంగా నటించేశాడు. మేఘా అయితే స్వీట్, యాక్టివ్ పర్సన్.
తెలుగు, హిందీ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. తమిళ్, మిగతా భాషల్లో కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. తెలుగులో అయితే దర్శకులతో చర్చించే అవకాశం ఉంటుంది. తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా మిగతా భాషల్లో నటించిన దానికంటే బాగా పర్ఫామెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. నేను దేవాజు అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నాను. తమిళ్ దేజావులో కంటే తెలుగు దేజావులోనే చక్కగా చేసినట్టు అనిపిస్తుంది.
నా కెరీర్ ప్రారంభంలో ఈ భాషలోనే చేయాలి.. ఆ భాషలోనే చేయాలని అనుకోలేదు. అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఈ మధ్యే నేను ఒక తెలుగు సినిమాను పూర్తి చేశాను. గేమ్ ఆన్ అనే చిత్రం అద్భుతమైన కథతో రాబోతోంది. ఇప్పుడు తెలుగులో పని చేస్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే నేను తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను.
రోజా, జెంటిల్మెన్, అల్లరి ప్రియుడు, అన్నయ్య, యోధ ఇలా కొన్ని చిత్రాల్లో నాకు మంచి పేరు వచ్చింది. ఇవన్నీ నాకు నచ్చిన చిత్రాలే. గోవింద, హత్కడి అనే సినిమాలు పెద్దగా ఆడకపోయినా కూడా అవి నాకు ఇష్టం. ఆ సినిమాల్లో నేను ఎక్కువగా కామెడీ రోల్స్ చేశాను. నాకు కామెడీ రోల్స్ అంటే ఇష్టం.
నా వద్దకు వచ్చిన వాటిల్లో నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటాను. నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా నేను చేసేందుకు రెడీగా ఉన్నాను. ప్రస్తుతం నన్ను ఎవ్వరూ కూడా ముంబై అమ్మాయిగా చూడటం లేదు. రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్లు ఇక్కడకు వచ్చి తెలుగు నేర్చుకున్నారు. ఏ భాషలో సినిమాలు చేస్తే ఆ భాషకు చెందిన అమ్మాయిగా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. నేను అయితే ఎక్కువగా నార్త్ ఇండియన్లా కనిపించను. సౌత్ ఇండియన్లా కనిపించను. అదే నాకు ప్లస్.
నేను ప్రస్తుతం హిందీలో కర్తమ్ హుక్తమ్ అనే సినిమాను సోనమ్ షాతో కలిసి చేస్తున్నాను. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. వివేక్ శర్మ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాను. ఈ మధ్యే కలిబలి అనే సినిమా వచ్చింది