ప్రతిరోజు పండగే అందరికి నచ్చే సినిమా “సాయి తేజ్.” డిసెంబర్ 20న ప్రతిరోజు పండగే విడుదల !!!

583

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ….
మెగా ఫ్యాన్స్ అందరికి నమస్కారం. మారుతి డిజైన్ చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐడియా బాగుంది. సందేశాన్ని ఆహ్లాదకరంగా చెప్పే ట్యాలెంట్ ఉన్న వ్యక్తి మారుతి, అలాగే థియేటర్ లో ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ మారుతి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా చిత్ర యూనిట్ అందరూ నమ్మకంగా ఉన్నాం. సాయి తేజ్ ఈ సినిమాలో చక్కగా నటించాడు. తెలిపారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ…
మా ఫంక్షన్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ ఉంటే మాకు ప్రతిరోజు పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యాన్స్, వారందరు గర్వపడాలి నేను సినిమాలో సిక్స్ ప్యాక్ చేశాను. మారుతి గారు నాకోసం అదిరిపోయే స్క్రిప్ట్ చేశారు. సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో పాటు అభిమానుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్న. తమన్ నాకోసం మంచి సాంగ్స్ ఇచ్చాడు. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ….
ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు. నాకు ఒక టెంపుల్ లో వచ్చిన ఐడియాని దిల్ రాజు గారికి చెప్పాను. రాజు గారికి బాగా నచ్చింది, ఆ తరువాత యూవీ వంశీకి, తేజ్ కి చెప్పడం అందరికి నచ్చడంతో సినిమా మొదలుపెట్టాము. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్ అందరికి థాంక్స్.