`రూల‌ర్‌` అభిమానులు, ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌

680

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను బోయ‌పాటి శ్రీను, నంద‌మూరి రామ‌కృష్ణ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, గంటా శ్రీనివాస‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, వాసుప‌ల్లి గ‌ణేష్‌, సి.క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్, డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, శ్రీభ‌ర‌త్‌, సోనాల్ చౌహాన్‌, వేదిక, అంబికా కృష్ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “ఎన్టీఆర్, బ‌స‌వ‌తార‌క‌మ్మ పుణ్య దంప‌తుల క‌డుపున పుట్ట‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న‌గారి బాట‌లో న‌డుస్తూ వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తున్నాను. ఆదిత్య 369, శ్రీరామ‌రాజ్యం, గౌత‌మిపుత్ర‌శాకర్ణి, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల కృష్ణ‌య్య‌, సింహా, లెజెండ్ వంటి ఎన్నెన్నో పాత్ర‌ల‌ను చేశాను. క‌ళామ‌త‌ల్లికి సేవ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేసుకుంటున్నాను. నేను ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న బాగా న‌మ్మారు. మ‌న‌మే ముందు అడుగు వేయాల‌ని ఆయ‌న న‌మ్మారు. అది సినిమాలైన కావ‌చ్చు.. రాజ‌కీయాలైన కావ‌చ్చు. అన్నింటినీ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. నేను, కల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ క‌లిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఆ స్ఫూర్తితోనే రూల‌ర్ సినిమాను చేశాం.