ద‌ర్శ‌కుడు కుమార్‌.జి’ప్ర‌ణ‌వం` చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా భావిస్తున్నాం-

158

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్ ప‌తాకంపై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక నల్వా, గాయత్రి రీమ హీరో హీరోయిన్లుగా కుమార్‌ జి. దర్శత్వంలో తను.ఎస్ నిర్మించిన ల‌వ్ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రం ఈ నెల 5న గ్రాండ్ గా విడుద‌లై పాజిటివ్ టాక్ తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ త‌మ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు

హీరో శ్రీ మాట్లాడుతూ..“ ప్ర‌ణ‌వం` చిత్రాన్ని ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు నా ధ‌న్య‌వాదాలు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ తో ఫ‌స్టాప్ లో వ‌చ్చే నా పాత్ర‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకున్నా . కానీ దానికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అలాగే బ్రేకప్ సీన్ కి, క్లైమాక్స్ కి ప్రేక్ష‌కులు క్లాప్స్ కొడుతుంటే హ్యాపీగా ఉంద‌న్నారు.

హీరోయిన్ గాయ‌త్రి మాట్లాడుతూ…“భ‌ర‌త నాట్యం టీచ‌ర్ గా , అతి ప్రేమ‌ను క‌న‌బ‌రిచే అమ్మాయిగా నేను ఇందులో న‌టించాను. నా పాత్ర‌కు ఆడియ‌న్స్ నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది“ అన్నారు.
జెమిని సురేష్ మాట్లాడుతూ…“ప్ర‌ణ‌వం చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు నా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో నేను ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. దానికి మంచి గుర్తింపు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కుమార్.జి మాట్లాడుతూ…“మా సినిమా ఈ నెల 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుద‌లైంది. అన్ని ఏరియాల నుంచి స్పంద‌న బావుంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా బావుందంటూ ఫోన్ చేసి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. స్టోరీతో పాటు అంత‌ర్లీనంగా చెప్పిన సందేశం, సంగీతం, న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ కి మంచి పేరొస్తోంది. చైత్ర పాత్ర సినిమాకే హైలైట్“ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ…“జిఎమ్ ఆర్` న్యూ ఢిల్లీ సంస్థ వారు మా సినిమా స్పెష‌ల్ షో వేయించుకుని చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత‌గా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఇలాంటి బ్యాడ్ టైమ్ లో కూడా సేఫ్ ప్రాజెక్ట్ గా నిల‌వ‌డం సంతోషం. బీసీ సెంట‌ర్స్ లో ర‌న్ బావుంది. రేప‌టి నుంచి మ‌రికొన్ని సెంట‌ర్స్ పెంచుతున్నా“మ‌న్నారు