చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరో హీరోయిన్లుగా కుమార్ జి. దర్శత్వంలో తనూజ.ఎస్ నిర్మించిన లవ్ అండ్ థ్రిల్లర్ చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ నెల 29న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“ ఈ రోజుల్లో` చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా కొంత గ్యాప్ తర్వాత వస్తోన్న చిత్రం `ప్రణవం`. మరో మారు హీరోగా తనేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇక దర్శకుడు కుమార్ కి ఇది తొలి సినిమా అయినప్పటికీ క ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. ప్రజెంట్ కొత్త కథలతో పోటీ పడి సినిమాలు చేస్తోన్న దర్శకుల లిస్ట్ లో మా దర్శకుడు కుమార్ కూడా చేరతారు అన్న నమ్మకంతో ఉన్నాం. కథకి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా రిచ్ గా నిర్మించాం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఈ నెల 29న సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
TECHNICIANS & ARTISTS
జెమిని సురేష్, నవీన, జబర్దస్త్ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల కుమార స్వామి; స్టిల్స్: శశాంక్ శేఖర్; డిఓపి: మార్గల్ డేవిడ్; కొరియోగ్రాఫర్: అజయ్; కో-డైరక్టర్: శ్రావణ్ నల్లూరి; సంగీతం: పద్మనావ్ భరద్వాజ్; ఎడిటర్: సంతోష్; ఫైట్స్: దేవరాజ్; లిరిక్స్: కరుణ కుమార్, సిహెచ్ విజయ్‌కుమార్, రామాంజనేయులు; నిర్మాత: తనూజ.ఎస్; కో- ప్రొడ్యూసర్స్ః వైశాలి, అనుదీప్; దర్శకత్వంః కుమార్.జి.
Kumar Swamy PRO [Boxoffice]
9963444643