పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో రైతు బంద్

392

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తూ స్వీయదర్శ కత్వంలో నిర్మిస్తున్న సినిమా *రైతు బంద్* షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.ఫిబ్రవరి లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ:ఏవైతే రైతులకు మేలు జరుగుతాయి అని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందో అవి రైతులకు శాపాలు మాకు ఉరితాడు అని పంజాబ్,ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదలగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పెద్ద ఉద్యమం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాలను తీసుకు రావడం వల్ల దేశంలో వున్న వ్యవసాయం అంత కార్పొరేట్ మయం అయిపోతుంది. వాణిజ్య పరంగా మీరు ఎవరికైతే వెసులుబాటు కల్పిస్తున్నా రో వాళ్ళు మొత్తం సరుకుని రైతు దగ్గర కొని కృత్రిమ కొరత సృష్టించి రైతులను ప్రజలను చాలా డామేజ్ చేస్తారు. దయవుంచి ఆ చట్టాలను మీరు వెంటనే రద్దు చెయ్యండి మీరు ఒకే భారత్ ఒకే మార్కెట్ అంటున్నారు. రైతు పండించే పంట ను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఏ రేటు కైన అమ్ముకోవచ్చు అంటున్నారు. దేశంలో వున్న 75% వ్యవసాయ రంగం ఈరోజు 60% చేరుకుంది.ఈ 60% లో కూడా కౌలు రైతులు 40% కొచ్చారు.భూస్వాములు వంద ఎకరాలు రెండువందల ఎకరాలు వున్నవారు 5% తప్పితే మిగతా వాళ్ళు చిన్న సన్నకారు రైతులే. అటువంటి వారు పంటలు రాగానే వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటారు మార్కెట్ యార్డులు, fci, cci కానీ ఇలాంటి అనేక సంస్థలు రైతులకోసం ఆహార భద్రత కోసం గవర్నమెంట్ పెట్టింది. మార్కెట్ యార్డులు మన దేశంలో పల్లెల్లో జిల్లాల్లో ఒక కార్మిక బడులాగా ఆస్పత్రులు లాగా రైతులకోసం పనిచేస్తున్నాయి. అలాంటిది ఈ చట్టాలతో మార్కెట్ యార్డులు కొలాప్స్ అయిపోతాయి.దానివల్ల కొనుగోలు కేంద్రాలు వుండవు మేము మి సరుకు కొనం అని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చెపుతాయి అలాంటప్పుడు రైతు ఏమైపోతాడు.రైతు రక్షణ కోసం స్వామినాథన్ కమిటీ సిఫార్సులు చాలా మంచివి. స్వామి నాథన్ కమిటీ దేశంలో పర్యటించి అందరినీ అడిగి తీర్మానం చేసింది.రైతు కి గిట్టుబాటు ధర రావాలి అంటే ఆత్మహత్య చేసుకోకూడదు అంటే ఏంచేయాలి . రైతు పండించే పంట కి తను పెట్టే పెట్టుబడికి శ్రమ, వడ్డీ, కౌలు అన్ని పోను అదనంగా50% శాతం ఇస్తే రైతుకు మేలు జరుగుతుంది.ఆ రకంగా గిట్టుబాటు ధరను నిర్ణయించండి అని స్వామినాథన్ కమిటీ సిఫార్స్ చేసింది. ఆనాడు వున్న upa గవర్నమెంట్ ఏ కమిటీ వేసిందో ఆ కమిటీ చేసిన ఆ సిఫార్స్ ను అమలు చేయలేదు. ఆతరువాత వచ్చిన nda గవర్నమెంట్ ఎన్నికల ముందు అధికారంలో కి వస్తె స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను అమలు చేస్తాము అని చెప్పింది.కానీ ఆ స్వామినాథన్ కమిటీ నీ ఇంప్లిమెంట్ చెయ్యకుండా శాంతా రామ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ శాంతా రామ్ కమిటీ సిఫార్స్ మేరకే ఇప్పుడు చేసిన వ్యవసాయ చట్టాలు.ఎపుడు జరుగుతున్న రైతు ఉద్యమం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అంత గొప్ప ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు కేంద్రానికి 6,7సార్లు చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. గవర్నమెంట్ రైతు కోరికలను మన్నించ కుండా వుంటే ఇదేమి ప్రజా స్వామ్యం చెప్పండి. సడెన్ గా లాకదౌన్ సమయంలో పార్లమెంట్ లో ఈ చట్టాలను తీసుకు వచ్చి వీటితో పాటు విద్యుత్ సంస్కరణలు తీసుకు వచ్చింది కేంద్రం. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు చాలా పార్టీలు trs, అన్నాడీఎంకే, అనేక పార్టీలు బిల్లు ప్రవేశ పెట్టొద్దు సెలక్ట్ కమిటీకి పంపవద్ది అని మరి మరి చెప్పాయి. కానీ కేంద్రం ఎవ్వరినీ ఖతార్ చేయకుండా ఈ రైతు సంఘాలను పిలవకుండా వేరే ప్రవేశ పెట్టేసి వారే ఆమోద ముద్ర వేసి జనాల మీద రుద్దుతూ వుంటే ఏమీ ప్రజాస్వామ్యం అండి ఇది.నేను కేంద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.అయ్య గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి శిరస్సు వహించి దణ్ణం పెడుతున్న. ఉద్యమం చేస్తున్న రైతుల డిమాండ్స్ ను ఎక్సెప్ట్ చెయ్యండి.ఇప్పటికే మన దేశంలో విద్య, వైద్య, విమానయానం, నౌకా యానాం lic భేల్ అన్ని కూడా ప్రవేట్ పరం అయిపోయాయి.ఈ రోజు వ్యవసాయం కూడా ప్రవేటు పరం అయితే ఈ దేశం ఎక్కడకు పోతుంది.ఎవరి చేతుల్లో పోతుంది…కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోతుంది. అలా పోకుండా అందరూ స్వేచ్చగా హ్యాపీగా వుండాలి అంటే ఈ మూడు చట్టాలను రద్దు చెయ్యండి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞపి చేస్తున్నా నా యి రైతు బంద్ చిత్రం ద్వారా.

ఇక విద్యుత్ సంస్కరణలు అంటున్నారు ఇప్పటికే మన తెలంగాణా రాష్ట్రం కేసీఆర్ గారు గాని ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు గాని నవీన్ పట్నాయక్ గాని కేజ్రీ వాల్ గాని మమత బెనర్జీ గాని అనేకమంది అయా రాష్ట్రాలలో రైతులకోసం ఉచిత కరెంట్ నిస్తున్నారు .ఈ మూడు చట్టాల వల్ల ఇపుడున్న రాష్ట్ర ప్రభుత్వాలూ రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు పెట్టాయి అవి అన్నీ కూడా పోతాయి. అందుకు విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా ఎత్తేసెయ్యండి అది నా విజ్ఞప్తి. మనదేశం భిన్నత్వంలో కూడిన ఏకత్వం తో కూడుకున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హక్కుల పై దాడి చేస్తుంది. అలా కాకుండా రాష్ట్రాలను గౌరవించండి.వ్యవసాయ రంగంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా రాష్ట్రాలకే అధికారం వుండాలని సుప్రీం కోర్టు రెండు కాదు మూడు సార్లు తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రాష్ట్రాలకు అధికార లు ఇచ్చి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చెయ్యాలి అని నా విజ్ఞప్తి అదే నా సినిమా. దేశములో అనేక మంది వారి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు.కానీ రైతే ఉద్యమం చేస్తే , రైతే బంద్ చేస్తే దేశం ఏమయిపోయింది. రైతే బంద్ చేస్తే ఏమిటి అన్నది నా సినిమా రైతు బంద్.ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.షూటింగ్ మొత్తం పూర్తయింది.పిబ్రవరిలో రిలీజ్ చేస్తాము అని అన్నారు.

PRO ; 10 TV SATISH