ఇది అవమానాలతో పుట్టిన ప్యానెల్’ | MAA అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్

466

మీడియా ని చూస్తే భయం వేస్తోంది.మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు బిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింది.ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు.ఆరు నెలల గా ఈ కార్యక్రమం నడుస్తోంది..

మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం.ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తుంది.మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం.ఇది మా ఆవేదన.గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.నా ప్యానెల్ లో నలుగురు MAA మాజీ అధ్యక్షులు ఉన్నారు.తరువాత నేను తప్పు చేసినా బయటికి పంపిస్తారు.అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో సమస్య గురుంచి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారు.ఇందులో లోకల్ నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు.గత ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.ఇప్పుడే ఎందుకు?తెలుగు అనేది గౌరవం అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు.కోర్ ప్యానెల్ కాదు.. ఆవేదన తో పుట్టిన ప్యానెల్” అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.”నా స్థలంలో 10 ఎకరాలు ప్రకాష్ రాజ్ అన్నకు ఇచ్చాను.ఎంతో మందికి పని కల్పించారు.ప్రకాష్ రాజ్ కి అవకాశం ఇస్తే అసోసియేషన్ బాగుంటుంది.లోకల్ నాన్ లోకల్ అనే సమస్య ఇక్కడ లేదు.23 ఏళ్ళు ఆయన ఇక్కడ స్థిరపడి.మా ఊళ్ళో ఏందో మందికి పని ఇచ్చారు.ప్రకాష్ రాజ్ అంటే మా ఊళ్ళో తెలియని వారు ఉండరు” అని బండ్ల గణేశ్ చెప్పారు.

“ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మా అన్నయ్య చిరంజీవి మద్దతు తెలిపారు.రెండు నెలల కింద ప్రకాష్ మమ్మల్ని కలిసాడు.. ఇందులో ఉన్న సమస్యలు చెప్పాడు.బిల్డింగ్ లేదు.MAA అంటే ఒక కుటుంబం అని చెప్పాడు.ప్రతి ఒక్కరితో మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి.మూడు నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి వారికి పని కల్పించాడు.ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం.లోకల్ నాన్ లోకల్ అనేది సమస్య ఉత్పన్నం కాదు.మనం తెలుగు యాక్టర్ కాదు.ఇండియన్ యాక్టర్స్.పెద్దోళ్లకే లేని లోకల్ సమస్య ఒక కుటుంబం లాగా ఉండే వారికి ఎందుకు.మేము కూడా మద్దతు తెలుపుతున్నాం” అని నటుడు నాగబాబు అన్నారు.