బ‌తుకు బ‌స్టాండ్ మూవీ నుంచి విడుద‌లైన‌ మాస్ సాంగ్ బుస్సా బుస్సాకు అనూహ్య స్పంద‌న‌

82


విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకం పై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. బ‌తుకు బ‌స్టాండ్ అనే టైటిల్ పెట్టిన‌ట్లుగా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగుతూ వ‌స్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన మొద‌టి పాట యూట్యూబ్ లో విశేషాద‌ర‌ణ అందుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌లైన‌ బ్రేజిలియ‌న్ మోడ‌ల్ జెన్నీఫ‌ర్ పిక్కినాటో చిందేసిన బుస్సా బుస్సా అంటూ సాగే ఓ మాస్ ఐట‌మ్ సాంగ్ కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి తెలిపారు, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

నటీనటులు:
విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి తదితరులు

టెక్నికల్ టీం:
బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్
సమర్పణ : K చక్రధర్ రెడ్డి
రచన, దర్శకత్వం : I.N. రెడ్డి
నిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవి
డిఓపి : వాస్ కమల్
సంగీతం : మహవీర్
పీఆర్ఓ : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్
కొరియోగ్రఫీ : శివాజీ
యాక్షన్ : శంకర్.U

PRO;ELURU SEENU