వాలెంటైన్స్ డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ వాలెంటైన్స్ నైట్ థీమ్ పార్టీ.. సౌత్ ఇండస్ట్రీలో మొట్ట మొదటిసారి..

241

విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు ‘రాధే శ్యామ్’ టీమ్. తాజాగా వాలెంటైన్ వీక్ రావడంతో సినిమా ప్రమోషన్ మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేసారు. సౌత్ ఇండస్ట్రీలోనే మొదటి సారిగా ఈ సినిమా కోసం థీమ్ పార్టీ చేయబోతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్. హైదరాబాద్ కెమిస్ట్రీ క్లబ్బులో ఈ పార్టీ జరగనుంది. ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి పార్టీ మొదలు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేస్తున్నారు. సినిమా కథను ప్రతిబింబించేలా ఓ చేయి.. స్టెతస్కోప్.. సహా మరికొన్ని ఆర్ట్స్ కూడా అక్కడ దర్శనమివ్వబోతున్నాయి.
ఈ థీమ్ పార్టీకి యూనిట్ అంతా హాజరు కానున్నారు. విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది ఈ సినిమా. అన్ని ఇండస్ట్రీలలో రాధే శ్యామ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయి. రాధే శ్యామ్ సినిమాకు ఆయన నేపథ్య సంగీతం అందించారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తమన్. సినిమా చూస్తున్నప్పుడు ఒక తెలియని ట్రాన్స్ లోకి వెళ్లిపోయానని.. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు ఈయన.
రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతోందని.. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ రాధే శ్యామ్ సినిమా కూడా ఉన్నట్లే అంటున్నారు తమన్. అంత నిజాయితీ ఉన్న ప్రేమ కథ ఇది అని తెలిపారు ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరే అని తెలిపారు తమన్. గతంలో సాహో సినిమా ట్రైలర్ కు మాత్రమే RR అందించే అవకాశం వచ్చిందని.. ఇప్పుడు సినిమా మొత్తానికి రీ-రికార్డింగ్ అందించడం ఆనందంగా ఉంది అంటున్నారు తమన్. రాధే శ్యామ్ పై ఈయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇప్పుడు ఈ వాలెంటైన్స్ డే థీమ్ పార్టీతో ఆసక్తి మరింత పెరగడం ఖాయం. గోపీకృష్ణ మూవీస్, యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మించాయి.