HomeTeluguరెబల్ స్టార్ ప్రభాస్ "రాధే శ్యామ్" మొదటి సింగిల్ 'ఈ రాతలే'కు అనూహ్యమైన స్పందన..

రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” మొదటి సింగిల్ ‘ఈ రాతలే’కు అనూహ్యమైన స్పందన..

చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మెష‌న్ పోస్ట‌ర్ తోనే రివీల్ అయ్యింది. మొన్న విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధే శ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్. తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు.

ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..
వీరి దారొకటే.. మరి దిక్కులే వేరులే..
ఊపిరొకటేలే.. ఒక శ్వాసలా నిశ్వాసలా ఆటాడే విధా ఇదా ఇదా పదే పదే..
కలవడం ఎలా ఎలా.. రాసే ఉందా రాసే ఉందా..

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..

ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో.. నాతో ఏదో కథ చెప్పాలంటుందే..
ఏ గూఢాచారో.. గాఢంగా నన్నే..
వెంటాడెను ఎందుకో ఏమో..
కాలం మంచు కప్పి గుండెల్లో గుచ్చే..
గాయం లేదు కానీ దాడెంతో నచ్చే..
ఆ మాయా ఎవరే.. రాదా ఎదురే.. తెలియకనే తహతహ పెరిగే..
నిజమో భ్రమో.. బాగుంది యాతనే..
కలతో కలో.. గడవని గురుతులే..
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

ఈ రాతలే.. దోబూచులే..
ఈ రాతలే.. దోబూచులే..

ఎవరో వీరెవరో.. కలవని ప్రేమికులా..
ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా..

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్య శ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్‌కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు

టెక్నికల్ టీమ్: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ.. నిక్ పావెల్‌,
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ.. వైభ‌వి మ‌ర్చంట్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌..సౌండ్ ఇంజ‌నీర్‌.. ర‌సూల్ పూకుట్టి,
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES