పూజా హెగ్డే అసంతృప్తిగానే ‘వాల్మీకి ‘ లో నటిస్తోందా?

522

…. అవుననే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి ‘ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదట, ఈ విషయం ముందుగానే పసిగట్టిన పూజా తొలుత ఈ చిత్రంలో నటించడానికి ససేమిరా అందట. అందుకు దర్శకుడు హరీష్ శంకర్ పూజాని ఒప్పించి క్యారెక్టర్ ను బాగా డెవలప్ చేస్తానని చెప్పడంతో గత్యంతరం లేక సరేనందట. షూటింగ్ సాగుతున్న తరుణంలో పూజా పాత్రలో ఎలాంటి మార్పులు కనిపించలేదట. ఈ విషయం తెలుసుకున్న పూజా దర్శకుడిని నిలదీసిందట. అందుకు దర్శకుడు సినిమా పూర్తయ్యాక మీ పాత్రకు ఉన్న ప్రాధాన్యత మీకే తెలుస్తుందని చెప్పడంతో పూజా హెగ్డే అసంతృప్తిగానే ‘వాల్మీకి ‘ని కానిచ్చేస్తుందట. ఈ విషయం గురించి పూజా హెగ్డే ని కదిలించాడట ఓ మీడియా పర్సన్ అప్పుడు.. ”నేను హ్యాపీగానే ‘వాల్మీకి ‘లో నటిస్తున్నా. హాయిగా షూటింగ్ లో పాల్గొంటున్నా. కావాలనే ఎవరో ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది. చిత్రసీమలో అనుభవం, అవకాశం.. రెండూ గొప్పవే. వచ్చిన అవకాశాలే మనల్ని రాటు తేలేలా చేస్తుంటాయి. ఎవరి ప్రతిభ ఏంటన్నది తేలాలంటే ముందు అవకాశాలు రావాలి. నాలో ఎంత గొప్ప నటి అయినా ఉండొచ్చు. తాను బయటకు రాకపోతే … నాలో ఓ నటి ఉన్న సంగతి ఎవరికీ తెలిస్తుంది? ఏ సినిమా బాగా ఆడుతుందో, ఏది ఆడదో లెక్క కట్టడం చాలా కష్టం. ఆ సినిమా వల్ల నేనేం నేర్చుకుంటాను? ఆ సినిమా చేస్తున్నప్పుడు , ఆ పాత్రతో ప్రయాణం చేస్తున్నపుడు నేనెంత ఆనందంగా ఉంటాను? అనేదే ఆలోచిస్తా. ఇక విజయం అంటారా? అది ఎప్పుడూ బోనస్ గానే భావించాలి. అటు విజయం దక్కక, ఇటు పని చేసి నందుకు సంతృప్తి లేకపోతే అలాంటి పాత్రలు చేయడంలో అర్థం ఉండదు. నా తాజా చిత్రం ‘వాల్మీకి ‘ లో నేను పోషిస్తున్న పాత్రపై పరిశ్రమలో చాలా రూమర్స్ పుట్టిస్తున్నారు. వాటిని నేనేం పట్టిచ్చుకోను. నా పాత్రకున్న ప్రాధాన్యత నాకు బాగా తెలుసు ” అంటూ కాస్త అసహనంగానే చెప్పిందట! చూద్దాం.. ‘వాల్మీకి ‘ సినిమా విడుదలయ్యాక పూజా హెగ్డే పాత్రకున్న ప్రాధాన్యత ఏమిటో..?!