ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక

263

*కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి జంటగా నందన్ దర్శకత్వంలో రామ్ కామ్ బాక్డ్రాప్ లో రాజు రెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్ “. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ‘తెలియదే.. తెలియదే’ అనేపాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే ఉండడం మరో విశేషం. ఈ ఒక్క పాట సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా చిత్రంలోని ‘గగనము దాటే’ వీడియో సాంగ్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల ఆయింది.అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, హీరో దినేష్,పాగల్ డైరెక్టర్ నరేష్, నిర్మాత బాబ్జి , గాయత్రి గుప్త తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.*

*అనంతరం జరిగిన కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ..* ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి.ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడు తో ఈ కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా నిర్మించాడు.ఏ మూవీ కైనా నిర్మాత దొరకడంచాలా కష్టం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యినట్లు.ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి కొత్త ప్రొడ్యూసర్ రావడం చాలా సంతోషంగా ఉంది.డైరెక్టర్ నందన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇంకా ఇలాంటి మంచి మూవీస్ ఎన్నో చేయాలి. హీరోయిన్ రమ్య చాలా చక్కగా నటించింది. నా సినిమా RX 100 లోని “పిల్లారా..” సాంగ్ హిట్ అయినప్పుడే అదే ఇయర్ లో అభినవ్ ది ‘ఉండిపోరాదే’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఇయర్ హిట్ సాంగ్స్ లలో ఎప్పుడూ ఈ రెండు సాంగ్స్ మాత్రమే ఉండేవి. ఈ సాంగ్స్ మధ్యనే కాంపిటీషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు తన సినిమా ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాతో పాటు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

*చిత్ర నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ* …మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ కి కార్తికేయ కు,నిర్మాత బాబ్జి,దర్శకుడు నరేష్, దినేష్ గార్లకు ధన్యవాదాలు.ఈ సినిమాకు ఆర్.ఆర్.ధ్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.రమ్య, అభినవ్ కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.అభినవ్ మల్టీ టాలెంటెడ్. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో “మైల్స్ ఆఫ్ లవ్” చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాడు.రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ లో కాకుండా చేసిన ఈ సినిమా క్లీన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అన్నారు

*చిత్ర దర్శకుడు నందన్ మాట్లాడుతూ* ..మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రెజెంట్ యూత్ కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బాక్డ్రాప్ లో క్లీన్ మూవీగా రూపొందించాం.ఈ మూవీకు కొత్త డైరెక్టర్, కొత్త డిఓపి ని పెట్టుకొని నన్ను నా కథపై ఉన్న నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు మా నిర్మాత రాజిరెడ్డి గారు. తను ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. బెక్కం వేణుగోపాల్ గారు మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వారికి చాలా థాంక్స్. ఆర్.ఆర్ ధ్రువన్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఈ మ్యూజిక్ కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. అభినవ్, రమ్యల పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. ఈ రోజు ఈ చిత్రం ప్రి రిలీజ్ జరుపు కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

*చిత్ర సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ* .. నా లైఫ్ లో ఇది స్పెషల్ మూమెంట్. ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఇంత మంచి పాటలు ఇచ్చిన నా లిరిసిస్ట్ చారి,రాజు లకు ధన్య వాదాలు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

*చిత్ర హీరో అభినవ్ మేడిశెట్టి మాట్లాడుతూ* .. నందన్ తో మేము స్టోరీని డిస్కషన్ చేసుకొని మూవీ స్టార్ట్ చేశాము. డి.ఓ.పి మణి గారు ఓన్లీ కెమెరా వర్క్ వరకే కాకుండా నాకు ప్రతి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ లలో నాతో ట్రావెల్ అయ్యాడు. ధ్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటల ద్వారా ఈ సినిమాకు మంచి వెయిట్ వచ్చింది. నా సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2001లో వచ్చిన ‘చెలి’ సినిమా చూసినప్పుడు ఆ వినిమాలోని పాటలకు ఫీలింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సినిమాలోని పాటలకు ఆలాంటి ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మా టీంను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

*చిత్ర హీరోయిన్ రమ్య పసుపులేటి మాట్లాడుతూ*..నందన్ గారు నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను చాలా బాగా చూపించారు. అభినవ్ నాకు మంచి కో స్టార్. మేము చాలా మంచి ఫ్రెండ్స్. తన ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. బెక్కం వేణు గోపాల్ గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నా సినిమాకు ఇంత మంచి సాంగ్స్ కుదిరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంచి సినిమాలో నటించే ఆకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

 *నటీనటులు*
అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి,విస్మయశ్రీ, రవితేజ, సురేందర్ ,ప్రియ.

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ
సినిమా : మైల్స్ ఆఫ్ లవ్
ప్రొడ్యూసర్ : రాజిరెడ్డి
రైటర్ అండ్ డైరెక్టర్ : నందన్
మ్యూజిక్ : ఆర్.ఆర్.ధ్రువన్
డి.ఓ.పి : రవిమణి కె.నాయుడు,
ఎడిటర్ : బి నాగేశ్వర్ రెడ్డి
పిఆర్ఓ : సాయి సతీష్ , రాంబాబు పర్వతనేని