ప్లాంట్‌ మ్యాన్‌’ సెన్సార్‌ పూర్తి.. జనవరి 5 విడుదల!

147


ఇటీవలి కాలంలో కుటుంబ కథా చిత్రాలు, కామెడీ ఎంటర్‌టైనర్స్‌ కరువైపోయాయి. ఆ లోటును భర్తీ చేస్తూ ‘ప్లాంట్‌ మ్యాన్‌’ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ వచ్చేస్తోంది. కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ఇప్పుడు నిర్మాతగా మారి డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో కె.సంతోష్‌బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ప్లాంట్‌ మ్యాన్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.

ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెల్‌ పొందింది. జనవరి 5న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.‘ప్లాంట్‌ మ్యాన్‌’ చిత్రం గురించి నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సంతోషబాబును ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా ‘ప్లాంట్‌ మ్యాన్‌’ ఉంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని ఓ కొత్త ఎలిమెంట్‌ ఈ సినిమాలో ఉంది. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. జనవరి 5న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్‌, లక్ష్మీకిరణ్‌, శేఖర్‌, వీరభద్రం, శ్రీకుమారి, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: వినోద్‌ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, మాటలు: సాయికృష్ణ వెలిశెట్టి, పన్నారాయల్‌, పాటలు: ఈశ్వర్‌ హేమకాంత్‌, సింగర్స్‌: కుమార వాగ్దేవి, రోహిత్‌ శ్రీనివాసన్‌, నిర్మాత-దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్‌, దర్శకత్వం: కె.సంతోష్‌బాబు.