సాయి ధన్సిక ప్రధాన పాత్రలో సినిమా ప్రారంభం

634

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై పి.యస్.ఆర్ కుమార్ ( వైజాగ్ బాబ్జి) నిర్మాతగా, హరి కొలగాని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కబాలి ఫేమ్ సాయి దన్సిక ప్రధాన పాత్రలో రూపొందబోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి తొలి క్లాప్ దర్శకుడు వి వి వినాయక్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత బి.వి.యస్. ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రోజు ముహుర్తం జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ రేపటి నుండి ఇరవై రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటి లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది.

ఈ సందర్భంగా
నిర్మాత పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ: ‘ డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక మంచి కథ తో నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. నేను నిర్మతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రొత్సాహం ఉంది. మా బ్యానర్ లో మొదటి సినిమా ప్రేక్షకులను అలరించే విదంగా ఉంటుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ: ‘ నేను శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెకక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాను. నేను రాసుకున్న కథ సినిమా గా మారడానికి కారణం బెక్కం వేణుగోపాల్. ఈ సినిమా వెనక ఆయన ప్రొత్సాహాం చాలా ఉంది. రేపటి నుండి మెదటి షెడ్యూల్ ఆర్ ఎఫ్ సి లో మొదలవుతుంది. దన్సిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ’ అన్నారు.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ: ‘తెలుగు సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా స్పెషల్. ఇక్కడ సినిమా పరిశ్రమలో చాలా మంచి వాతావరణం ఉంటుంది. హారి గారు నాకు కథ చెప్పగానే ఓకే అనడానికి ఎక్కవ టైం తీసుకోలేదు. ఈ టీం అంతా కొత్తదే అయినా మంచి ప్లానింగ్ తో ఉంది. నేను ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’ అన్నారు.

ఈ చిత్రానికి
సమర్ఫణ: శ్రీమతి వాగేశ్వరి (పద్మ)
బ్యానర్: శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్: పి.యస్.ఆర్. కుమార్ ( బాబ్జి, వైజాగ్)
డి.ఓ.పి: వాస్లి శ్యాం ప్రసాద్
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
డైలాగ్స్: కరుణ్ వెంకట్
కో ప్రొడ్యూసర్: పవన్, సుమన్
ఎడిటింగ్: వెంకట్ బాబు
లిరిక్స్ : కిట్టు విస్సా ప్రగడ
ఆర్ట్ డైరెక్టర్: షర్మిల యెలిశెట్టి
కో డైరెక్టర్: సురేష్ నిది కొప్పుల
కోరియోగ్రఫీ: సుభాష్
స్టంట్స్: రాబిన్ సుబ్బు
లైన్ ప్రొడ్యూసర్ : వెంకట యస్ కె కులపాక
దర్శకుడు : హరి కొలగాని

నటీ నటులు:
సాయి ధన్సిక, కిషోర్ , తేజ్ కూరపాటి (హుషారు ఫేమ్)
అభినవ్ (హుషారు ఫేమ్)
ధీరజ్
నవకాంత్
చమ్మక్ చంద్ర