HomeTeluguఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ


పరారీ మూవీ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఆవిష్కరించారు.టీజర్ ను ప్రొడ్యూసర్ కౌన్సెల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జి వి వి గిరి నిర్మించిన చిత్రం పరారీ.. ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది..ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో ఈ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ: ఒక లక్యంతో ఈ సినిమాని నిర్మించాను. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.నేను సుమన్ గారి అభిమానిని.ఆయన వందవ సినిమా మేము చెయ్యాలి కానీ అది అవ్వలేదు.ఈ మూవీ లో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు అలీ షయాజి షిండే, మకరంద్ దేశ ముఖ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ నెల 30న సినిమా రిలీజ్ అవుతుంది. మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుంది అని అన్నారు

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ: హీరో యోగేశ్వర్ ఎక్స్పిరియన్స్ ఆర్టిస్టు లా నటించాడు. సినిమాలో పాటలు అన్ని బాగా వచ్చాయి. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నిర్మాత ఎక్కడ ఖర్చుకు వెను కాడకుండా నిర్మించారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్ అని అన్నారు.

ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడుతూ: టీజర్ నాకు బాగా నచ్చింది. కంటెంట్ ఉంటే సినిమా హిట్. సినిమాకి నిర్మాత బాగా ఖర్చుపెట్టి తీశారు అది విజువల్ గా కనపడుతుంది.హీరో కి ఆల్ దీ బెస్ట్..మహిత్ కి అల్ డి బెస్ట్.సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు జె జె ప్రకాష్...నిర్మాత గిరి గారు అబ్బాయి ఈ సినిమా తో హీరోగా పరిచయం అవుతున్నారు. అల్ ది బెస్ట్ యోగిశ్వర్. టీజర్ బాగుంది. సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలి..మహిత్ సాంగ్స్ బాగున్నాయి అని అన్నారు

నిర్మాత ఓలి మాట్లాడుతూ:
ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. హీరో బాగా నటించారు. నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.చాలా రిచ్ గా తీశారు అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ శక్తి రమేష్ మాట్లాడుతూ: యోగేశ్వర్ కొత్త యాక్టర్ లా కాకుండా చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా నటించారు..చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ:
నిర్మాత గిరి గారు నాకు మంచి మిత్రుడు..రెండు సంవత్సరాలు క్రితం కలిసినప్పుడు ఈ సినిమా గురించి చెప్పారు..తన కొడుకే హీరో అని చెప్పలేదు..ఆడియో ఫంక్షన్ లో గిరి గారి అబ్బాయి హీరో అని తెలిసింది..యోగేశ్వర్ ముందు చదువు కాంప్లిట్ చెయ్యమని చెప్పాను. ఇప్పుడు ఐ ఏ ఎస్ చదువుతున్నాడు..ఈ జనరేషన్ కి సరిపోయే కంటెంట్ ఉన్న సినిమ పరారీ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.ఎంటర్ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు..

యోగేశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను, నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES