వెగ శ్రీ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నందమూరి బాలకృష్ణ..

173

నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్ లో నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో ఎక్కువగా పలు కమర్షియల్ యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. తెలుగు టాక్ షోలలో అన్నిటింకంటే క్రేజ్ వచ్చేలా హోస్ట్ గా తన మార్క్ చూపించాడు. ఇలా సినిమాలు, టాక్ షోలు మాత్రమే కాకుండా కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్స్ లో కూడా సత్తా చాటుతున్నాడు బాలకృష్ణ. బాలయ్య వేగా జ్యూవెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా వేగ శ్రీ జువెలరీ అండ్ డైమండ్స్ కి సంబంధించి ఒక యాడ్ ఫిలిం షూటింగ్ ఇటీవల జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ని బిహైండ్ ది సీన్స్ ని తాజాగా శ్రేయస్ మీడియా సంస్థ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ వేగా జువెలర్స్ వేగా శ్రీ గోల్డెన్ డైమండ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారని కొంత కాలం పాటు ఆయన ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారని వెల్లడించారు.

ఈ విడియో అభిమానులకు పండుగల మారింది. వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలయ్య మార్చి 8న విజయవాడలో ప్రారంభం కానున్న కొత్త బ్రాంచ్ కు హాజరు కానున్నాడు. మార్చి 8న మధ్యాహ్నం వేగా జ్యూవేలర్స్ బ్రాంచ్ ను ఓపెనింగ్ చేయనున్నాడు బాలయ్య బాబు. ఇదిలా ఉంటే ఈ అడ్వర్టైజ్ మెంట్ కు సంబంధించిన మేకింగ్ ఫొటోలు, వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ యాడ్ మేకింగ్ గుర్రం ఆనంద్ కుమార్ డైరెక్ట్ చేయగా, నటీ నటులు నందమూరి బాల కృష్ణ, ప్రగ్యా జైస్వల్, సంజన ఆనంద్ నటించగా, ఈ యాడ్ పూర్తిగా శ్రేయస్ మిడియా తీసింది. ఈ యాడ్ షూట్ లో బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో ఎంతో గ్లామరస్ గా కనిపించగా.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చీరలో ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది. ఇక షూట్ కి సంబంధించి పనులు, బాలయ్య డైలాగ్ లు చెప్పడం, ప్రాక్టీస్ చేయడం, సరదా ముచ్చట్లని ఈ వీడియోలో చూపించారు. ఈ విడియోను శ్రేయాస్ మిడియా మొట్టమొదటి సారిగా సినిమా టీజర్ ను మించి హైదరాబాద్ ఎఎంబీ మాల్ లో లాంఛ్ చేసింది.