HomeTelugu"పాక" మలయాళ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో

“పాక” మలయాళ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో

మల్లేశం” దర్శకుడు రాజ్ రాచకొండ… బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలిసి నిర్మించిన మలయాళం సినిమా “పాక”

తెలుగులో “మల్లేశం” సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో కలిసి “పాక – ది రివర్ అఫ్ బ్లడ్” (The River of Blood) అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మల్లేశం చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ లు కోసి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శించటానికి ఎన్నికయింది.

ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ “మల్లేశం చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అని అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు పాక కథ బాగా నచ్చింది. ప్రేమ మరియు క్రూరత్వం గురించి భావోద్వేగాలను ప్రదర్శించే లోతైన కథ.

రెండు గొడవపడే కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే పాక. మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్ లో చిత్రీకరించాము. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్ మరియు జోసెఫ్ మాణికల్ ప్రధాన పాత్రలు పోచించారు.

సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శింపబడుతోంది” అన్నారు.

ఈ చిత్రం యొక్క ప్రదర్శన మరియు టిక్కెట్ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి – https://tiff.net/events/paka-the-river-of-blood

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES