సెప్టెంబర్ 17న సోని లివ్ లో “ప్రియురాలు” సినిమా స్ట్రీమింగ్

363

పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “ప్రియురాలు”. రామరాజు సినిమా పతాకంపై రామరాజు, అజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే “ప్రియురాలు” చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు.

ప్రియురాలు” చిత్ర ట్రైలర్ శనివారం విడుదలైంది. లవ్ ఈజ్ రొమాన్స్, లవ్ ఈజ్ హానెస్ట్, లవ్ ఈజ్ డైలెమా అంటూ ప్రేమ వివిధ స్వభావాలను ట్రైలర్ లో పేర్కొంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్, లవ్ మేకింగ్ విజువల్స్ చూపించారు. ఎక్స్టా మారిటర్ అఫైర్స్, ఎక్స్ట్రా మారిటల్ లవ్ అని చెబుతూ ట్రైలర్ ముగించారు. రెండు జంటల మధ్య సాగే సరికొత్త ప్రేమ బంధాన్ని ప్రియురాలు మూవీలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగులోకి వచ్చిన కొత్త ఓటీటీ సోని లివ్ లో ప్రియురాలు సినిమా ఈ నెల 17న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశీ, సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – మహి పి రెడ్డి, ఎడిటర్ – సాయి రేవంత్, కథ –   సహ నిర్మాతలు – గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు, నిర్మాతలు – రామరాజు, అజయ్ కర్లపూడి, దర్శకత్వం – రామరాజు