`ప‌హిల్వాన్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌

629

శాండిల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల 5 భాషల్లోవిడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో `ప‌హిల్వాన్‌` అనే పేరుతో వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సాయికొర్ర‌పాటి తెలుగులో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో `ప‌హిల్వాన్‌` ఫ‌స్ట్ టికెట్‌ను పి.వి.సింధు, బోయపాటి శ్రీను ఖ‌రీదు చేశారు. ఈ సందర్భంగా…
వ‌ర‌ల్డ్ బాడ్మింట‌న్ ఛాంపియ‌న్ పి.వి.సింధు మాట్లాడుతూ – పహిల్వాన్ వంటి సినిమాలు అంద‌రికీ స్ఫూర్తినిస్తుంది. హార్డ్‌వ‌ర్క్ ఎప్ప‌టికైనా స‌క్సెస్‌ను సాధిస్తుంది. మ‌న జీవితంలో మంచి చెడులుంటాయి. వాటిని దాటి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.
మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ – “చంద్ర‌యాన్ రాకెట్ ప్ర‌యోగంతో ప్ర‌పంచ‌దేశాల‌ను ఇండియా త‌న వైపు తిప్పుకునేలా చేస్తే.. త‌న బాడ్మింట‌న్ రాకెతో వ‌రల్డ్ చాంపియ‌న్‌గా ఎదిగిన పి.వి.సింధు అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ – “ప‌హిల్వాన్‌` ప్రీ రిలీజ్ వేడుక‌కి విచ్చేసిన పి.వి.సింధుగారికి థ్యాంక్స్‌. ఆమె సాధించిన విజ‌యం ప‌ట్ల మేం అంద‌రం గ‌ర్వంగా ఉన్నాం. నాకు తెలుగు ప్రేక్ష‌కులు ఇచ్చిన ప్రేమాభిమానాల‌ను మ‌ర‌చిపోలేను. రాజ‌మౌళిగారిని, ఆయ‌న తెర‌కెక్కించిన `ఈగ‌` చిత్రాన్ని నా లైఫ్‌లో మ‌ర‌చిపోలేను. సాయిగారు చాలా మంచి వ్య‌క్తి. మా స్నేహితుడు కృష్ణ ద‌ర్శ‌క నిర్మాత‌గా చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను తెర‌కెక్కించారు. స‌పోర్ట్ అందించిన ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
ద‌ర్శ‌కుడు ఎస్‌.కృష్ణ మాట్లాడుతూ – ప‌హిల్వాన్` షూటింగ్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా జ‌రిగింది. స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు రామోజీ ఫిలింసిటీలో సెట్స్ వేసి 80శాతం షూటింగ్ చేశాం. సాయి కొర్ర‌పాటిగారికి థ్యాంక్స్‌. ఆయ‌న టీజ‌ర్‌ను చూశారు. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో తెలుగులో ఈ సినిమాను భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు“ అన్నారు.