పాగల్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది – విశ్వక్ సేన్.

1090

‘ఫలక్‌నూమాదాస్‌’తో ఆకట్టుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్ రెండో చిత్రం‌ `హిట్`తో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలోతెరకెక్కుతోన్న చిత్రం `పాగల్`. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మే 1న గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. మార్చి 29 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పాగల్ టీం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈ ఈవెంట్‌కు హీరో తేజ సజ్జా, హీరోయిన్లు మేఘ లేఖ, సిమ్రన్ చౌదరి, ఇతర దర్శకులు పాల్గొన్నారు.

కచ్చితంగా ఆయన ప్రేమలో పడతారు.. మేఘలేఖ మాట్లాడుతూ.. ‘విశ్వక్ సేన్ హీరోనే కాదు డైరెక్టర్ అని కూడా తెలుసు. విశ్వక్ సేన్‌ స్క్రీన్ మీద కోప్పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆయన ప్రేమిస్తే.. మీరు కచ్చితంగా ఆయన ప్రేమలో పడతారు.. ప్రేమిస్తారు. డేట్ గుర్తుంది కదా? మే 1న రాబోతోంది. కచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది.’ అని అన్నారు.

మంచి పాత్రను ఇచ్చినందుకు విశ్వక్ సేన్‌కు థ్యాంక్స్..
బల్వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘పాగల్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాను. దానికి కారణం విశ్వక్ సేన్. మంచి పాత్రను ఇచ్చినందుకు విశ్వక్ సేన్‌కు థ్యాంక్స్. ఇటుక మీద ఇటుక పెడితే ఇళ్లు అయితది.. మా విశ్వక్ అన్నతో పెట్టుకుంటే లొల్లి అయితది’ అని అందరినీ అలరించారు.

సినిమా కోసం మీ అందరూ ఎలా ఎదురుచూస్తున్నారో..
రచ్చ రవి మాట్లాడుతూ.. ‘విశ్వక్ సేన్ అంటే మనలో ఒకడు.. గల్లీలో ఒకడు.. బస్తీకి ఒకడు.. జిల్లాలో ఒకడు. అద్దంలో చూసుకుంటే మనలో ఒకడు.. నీకు నువ్వే స్టార్. దమ్ముంటే నీకు నువ్వే హీరో అని చూపించాడు. ఫలక్ నుమా దాస్ నుంచి ప్రయత్నిస్తే.. పాగల్‌లో సెట్ అయ్యాను. ఓ చిన్న రోల్ చేశాను. సినిమా కోసం మీ అందరూ ఎలా ఎదురుచూస్తున్నారో.. నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.

అభిమానులు ఎలా కోరుకుంటున్నారో ..
డైరెక్టర్ సాహిత్.. ‘మీ అందరికీ మాస్ కా దాస్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయన చాలా మంచి వారు. స్టేటస్ బట్టి కాకుండా ప్రేమతో అందరినీ పలకరిస్తాను. డ్రైవర్ నుంచి పెద్ద బిజినెస్ వరకు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. పాగల్ సినిమా మే 1న రాబోతోంది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. మా కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలానే చూపించబోతోన్నాను’ అని అన్నారు.

ఎంతో ఒదిగి ఉంటారు..
విద్యా సాగర్ మాట్లాడుతూ.. ‘విశ్వక్ సేన్‌తో డీఓపీగా రెండు సినిమాలు చేశాను. తొమ్మిదేళ్ల పరిచయం ఉంది. పెద్దన్నలా ఉంటారు.. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను. వెళ్లిపోమాకే నుంచి కూడా చూస్తున్నాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఫలక్ నుమా దాస్ చేశాం. అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

హైద్రాబాద్‌లో నాకు దొరికిన మొదటి బెస్ట్ ఫ్రెండ్..
డైరెక్టర్ అశ్వంత్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. నేను తమిళంలో సినిమాలు చేశాను. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేయబోతోన్నాను. అదొక అద్భుతమైన చిత్రంగా మారుతంది. విశ్వక్‌ను కొత్త కోణంలో చూస్తారు. హైద్రాబాద్‌లో నాకు దొరికిన మొదటి బెస్ట్ ఫ్రెండ్ విశ్వక్ సేన్’ అని అన్నారు.

విశ్వక్‌ను కొత్త అవతారంలో చూడబోతోన్నారు..
సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘మీ (అభిమానులు) ఎనర్జీ చూస్తే నిజంగానే పాగల్ ఉంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో విశ్వక్ సేన్‌తో నటించాను. ఇప్పుడు విశ్వక్‌తో ఇది రెండో సినిమా. ఈ అవకాశం ఇచ్చినందుకు గోపీ, దిల్ రాజు గారికి థ్యాంక్స్. మే 1న విశ్వక్‌ను కొత్త అవతారంలో చూడబోతోన్నారు’ అని అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ… ‘ఎండలు బాగా కొడుతున్నాయ్.. నాకు పొద్దున్నే ఎండదెబ్బ కొట్టింది. జాగ్రత్తగా ఉండండి. చాలా ఓపికతో ఎదురుచూశారు. నా పుట్టిన రోజున నేను పని చేయాలని అనుకున్నాను. గతేడాది కరోనా వల్ల నాలుగు గోడల మధ్య జరుపుకున్నాను. ఇప్పుడు మీతో (అభిమానులు) జరుపుకుంటున్నాను. ఇకపై ప్రతీ రోజూ కనిపిస్తుంటాను. పాతికేళ్లు నిండి 26 ఏటలోకి వచ్చాను. ఈ పాతికేళ్లలో ఏం పీకానో తెలియదు కానీ.. రాబోయే రెండెళ్లలో దానికి డబుల్ ఉంటాయ్. మే 1 నుంచి మీ డైలాగ్‌లు మారిపోతాయ్.. ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్ నుమా దాస్ ఇలా ప్రతీ సినిమాలో ఓ డైలాగ్ పేలింది. మే 1 నుంచి కొత్త స్లోగన్ ఎక్కేస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది. డౌటే లేదు థియేటర్లకు వచ్చేయండి. సినిమా మీద ఎంతో నమ్మకం ఉంది. డైరెక్టర్ నరేష్, నిర్మాతలు బెక్కెం వేణు గోపాల్, దిల్ రాజు అందరికీ థ్యాంక్స్. ఎక్కడా కూడా తప్పు చేయలేదు. సినిమా బాగా వచ్చింది. ఎవరితో ఎంత బెట్ వేసుకుంటారో వేసుకోండి. కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎల్లుండి నుంచి వారానికో పాట ఉంటుంది.. ఒక్కటి కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. పాగల్ సినిమాలో 1600 మంది అమ్మాయిలను లవ్ చేశాను. అది కూడా సరిపోలేదు. పాగల్ లవ్ యాత్రను ఏప్రిల్ 12 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ప్రాంతంలో చేపడతాం. ఎవరికి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తానో తెలియదు. అందరూ రెడీగా ఉండండి’ అని అన్నారు.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385