ట్రైలర్ లాంచ్ ! “బ్రాందీ డైరీస్”

62

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ
చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా.   అలాంటి మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.”అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ” కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా”అన్నారు.

చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ….ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని “బ్రాందీ డైరీస్” టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది . ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా ప్రయోగాత్మకంగా “బ్రాందీ డైరీస్” ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం.రెగ్యులర్ సినిమా లా ఉండదు. ఉత్కంఠగా కూడా ఉంటుంది. అందరూ 60 రోజులు వర్క్ షాప్ చేశారు. రంగస్థల కళాకారులు కూడా సినిమాలో నటించారు. సినిమా చూసిన వారి నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. పెద్ద సినిమాకు ఎలాంటి గ్రాండ్ విజువల్ ఉంటాయో మా సినిమాలో కూడా అలాగే ఉంటుంది. మోనిక్ కుమార్ హాలీవుడ్ కెమెరామెన్ సినిమాకు వర్క్ చేశారు. ఇద్దరు కెమెరామెన్ లు వర్క్ చేశారు. పెంచల్ దాస్ గారు రాసి పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది. మూడు పాటలు ఉంటాయి. సాంకేతికంగా చూసుకుంటే చాలా పెద్ద సినిమా. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని” అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ .. అన్ని లొకేషన్స్ లతో సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది. కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో శేఖర్ మాట్లాడుతూ...సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దాదాపు రెండు నెలలు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ లో సినిమా గురించి చాలా నేర్చుకున్నా. తెలుసుకున్నాను.” అని అన్నారు

హీరోయిన్ సునీత సద్గురు మాట్లాడుతూ ..” ఇలాంటిసందేశాత్మక సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ గురించి తెలుపుతూ లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ మాట్లాడుతూ ” ఈ సినిమాను రిలీజ్ చేస్తునందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ తో పాటు ఈస్ట్ లో మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు నా వంతు కృషి చేస్తాను”అన్నారు.

చిత్ర నటీనటులు
గరుడ శేఖర్, సునీత సద్గురు,నవీన్ వర్మ,,కె.వి.శ్రీనివాస్, రవీందర్ బాబు,దినేష్ మద్న్యే తదితరులు

సాంకేతిక నిపుణులు
చిత్రం…బ్రాందీ డైరీస్
బ్యానర్. : కలెక్టివ్ డ్రీమ్స్
నిర్మాత : లేళ్ల శ్రీకాంత్
రచన- దర్శకత్వం : శివుడు
సంగీతం : ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్
ఎడిటర్: యోగ శ్రీనివాస్