మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్‌–19 లక్షణాలు కలిగిన రోగుల చికిత్స

524


హైదరాబాద్‌ కేంద్రంగా కలిగినటువంటి ఆప్టిమస్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డైరెక్టర్‌ ః పీ ప్రశాంత్‌ రెడ్డి, ఆప్టిమస్‌ ఫార్మా) నేడు తాము డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి తమ అనుబంధ సంస్థ ఆపి్ట్రక్స్‌ లేబరేటరీ ద్వారా ఫావిపిరావిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ) తయారీ కోసం అనుమతులను అందుకున్నట్లు వెల్లడించింది. దీనితో పాటుగా మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్‌–19 లక్షణాలు కలిగిన రోగులలో చికిత్స కోసం ఆప్టిమస్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తమ యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫావిపిరావిర్‌ 200ఎంజీ ట్యాబ్లెట్ల తయారీ, మార్కెటింగ్‌కు సైతం అనుమతులను అందుకుంది.
కంపెనీ తమ అంతర్గత సామర్థ్యంపై ఆధారపడి యాక్టివ్‌ ఫార్మా స్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ)ను తయారు చేయడంతో పాటుగా తమ అత్యాధునిక సమగ్రమైన పరిశోధన మరియు తయారీ కార్యకలాపాలను ఎఫ్‌డీఎఫ్‌ (ఫినీష్డ్‌ డోసేజ్‌ ఫార్మ్‌)లో ఫావిపిరావిర్‌ 200ఎంజీ ట్యాబ్లెట్లను తయారుచేయడానికి వినియోగించనుంది. ఆప్టిమస్‌ ఫార్మా ఈ డ్రగ్‌ను ‘ఫావికోవిడ్‌’ బ్రాండ్‌ పేరిట మార్కెట్‌ చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఆప్టిమస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా భారతదేశవ్యాప్తంగా ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ను ప్రత్యేకమైన సేల్స్‌ఫోర్స్‌ ద్వారా మార్కెట్‌ చేయడంతో పాటుగా సరఫరా చేయనుంది.
భారతదేశంలో వేగవంతంగా విస్తరిస్తున్న కోవిడ్‌–19 మహమ్మారి యొక్క అత్యవసర పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వేగవంతమైన అనుమతుల ప్రక్రియలో భాగంగా ఫావిపిరావిర్‌ 200ఎంజీ ట్యాబ్లెట్ల కోసం ఆప్టిమస్‌ ఫార్మాకు తయారీ మరియు మార్కెటింగ్‌ అనుమతులను డీసీజీఐ అందించింది. ఈ అనుమతులను పరిమిత ఉపయోగం కోసం మాత్రమే అందించారు. అందువల్ల ఈ ఔషదాన్ని వినియోగించే కోవిడ్‌–19 పాజిటివ్‌ రోగులు తప్పనిసరిగా పూర్తి సమాచారయుక్తంగా తమ సమ్మతి పత్రాన్ని చికిత్సకు ముందుగానే సమర్పించవలసి ఉంటుందని ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది.
ప్రిస్ర్కిప్షన్‌ ఆధారిత ఔషదం ఫావికోవిడ్‌. మొదటి రోజు రెండుసార్లు చొప్పున 1800ఎంజీ వాడాలి. అనంతరం రోజుకు రెండుసార్లు 800ఎంజీ ట్యాబ్లెట్లను 14 రోజుల పాటు వినియోగించాల్సి ఉంటుంది. ఆప్టిమస్‌ ఫార్మా ఈ ట్యాబ్లెట్లను తెలంగాణాలోని హైదరాబాద్‌ వద్ద నున్న తమ యుఎస్‌ ఎఫ్‌డీఏ మరియు డబ్ల్యుహెచ్‌ఓ–జీఎంపీ అనుమతించిన తయారీ కేంద్రంలో తయారుచేయనుంది. ఈ ఔషదం అటు హాస్పిటల్స్‌తో పాటుగా ఇటు రిటైల్‌ మార్గాలలో కూడా లభిస్తుందని ఆప్టిమస్‌ వెల్లడించింది.

ఫావిపిరావిర్‌ ఔషదం, మోస్తరు నుంచి మధ్యస్తపు కోవిడ్‌–19 లక్షణాలు కలిగిన రోగులలో ప్రోత్సాహకరమైన ఫలితాలను అందిస్తుందని క్లీనికల్‌గా నిరూపితమైంది. ఈ యాంటీవైరల్‌, విస్తృతశ్రేణిలో యాంటీ–వైరల్‌ (ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లు)ను క్లీనికల్‌గా మెరుగుదలతో అందిస్తుంది. చికిత్స ఆరంభించిన నాలుగు రోజులలోనే ఇది గణనీయంగా వైరస్‌ లోడ్‌ను తగ్గిస్తుంది మరియు వేగవంతంగా లక్షణాలను తగ్గించడంతో పాటుగా రేడియోలాజికల్‌గా పురోగతిని అందిస్తుంది.
ఫావిపిరావిర్‌పై తమ కార్యకలాపాలను జనవరి 2020 ఆరంభంలోనే ఆప్టిమస్‌ ఫార్మా ప్రారంభించింది. ఎందుకంటే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌పై ఇది సమర్ధవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది. కోవిడ్‌–19 కు కారణమైన వైరస్‌ సార్స్‌–కోవ్‌–2. విజయవంతంగా యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌ (ఏపీఐ)ను అభివృద్ధి చేయడంతో పాటుగా ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లను తమ అంతర్గత ఆర్‌ అండ్‌ డీ బృందం విజయవంతంగా అభివృద్ధి చేసింది.

ఫావిపిరావిర్‌ను వాస్తవంగా జపాన్‌లో 2014లో నోవెల్‌ లేదా రీ ఎమర్జింగ్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ చికిత్స కోసం అనుమతించారు. ఇది వినూత్నంగా పనిచేసే యంత్రాంగం కలిగి ఉంది. ఇది చురుకైన ఫాస్ఫోరిబోసిలేటెడ్‌ ఫార్మ్‌ (ఫావిపిరావిర్‌–ఆర్‌టీపీ)గా కణాలలో మారుతుంది మరియు వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ ఫాలిమిరాజ్‌ చేత సబ్‌స్ట్రాట్‌గా గుర్తించబడుతుంది. తద్వారా ఆర్‌ఎన్‌ఏ పాలిమిరాజ్‌ యాక్టివిటీ ని నిరోధిస్తుంది.
ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల శ్రీ ప్రశాంత్‌ రెడ్డి పీ, డైరెక్టర్‌– ఆప్టిమస్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘కోవిడ్‌–19 కేసులు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి మరియు ఇప్పుడు చికిత్సావకాశాలు కూడా తక్కువగా ఉన్నవేళ భారతీయ ఔషద నియంత్రణ సంస్థ నుంచి సరైన సమయంలో అనుమతులను అందుకున్నాం. ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్స్‌తో పోల్చినప్పుడు వ్యాధి నిర్వహణ పరంగా రోగులకు ప్రయోజనకారిగా ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆప్టిమస్‌ ఫార్మా ఇప్పుడు ఇతర సుప్రసిద్ధ ఫార్మా కంపెనీలు, ప్రభుత్వం, ఆస్పత్రులతో కలిసి పనిచేయడం ద్వారా ఫావీకోవిడ్‌ను వేగవంతంగా దేశవ్యాప్తంగా రోగులకు అందుబాటు ధరలలో అందించనుంది’’ అని అన్నారు.
శ్రీ ప్రశాంత్‌ రెడ్డి మరింతగా చెబుతూ ‘‘ దేశీయ సరఫరాతో పాటుగా ఆప్టిమస్‌ ఇప్పటికే ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లను అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు, ఫావికోవిడ్‌ ట్యాబ్లెట్లను ప్రభుత్వ సంస్థల ద్వారా సరఫరా చేయడానికి సైతం ఉన్న అవకాశాలను వెదుకుతున్నాం’’ అని అన్నారు

About Optimus group
Optimus Pharma Pvt. Ltd., is a research oriented pharmaceutical company with presence in over 100 countries including the USA, EU and Japan. Optimus is currently a leading player in Anti-Diabetic, Anti-Fungal, Hepatitis, Gastro, CNS disorders. For more information about Optimus Pharma Pvt. Ltd., please visit www.optimuspharma.comదటి ఫార్మా కంపెనీ…