ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

571

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
అనంతరం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ ‘‘మాది క్రాస్ జోనర్ ఫిల్మ్. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్. ఈ సినిమా ప్రయాణంలో అబ్బూరి రవి నాకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలిచారు. బ్యాక్ బోన్ లా నిలబడ్డారు
ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘నాకు సాయికిరణ్‌ అడివిగారు ఈ కథ చెప్పి… అందులో ఎన్‌.ఎస్‌.జి కమాండో అర్జున్‌ పండిట్‌ క్యారెక్టరైజేషన్‌ చెప్పారు. అప్పటికి కశ్మీర్‌లో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నంత లేవు. కశ్మీర్‌ సమస్యను మేం పబ్లిసిటీకి వాడుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం సాయికిరణ్‌ అడివిగారు కథ రాసుకున్నారు. ఈ సినిమాలో కొన్ని నిజాలు చెప్పాం.
నిత్యా నరేష్‌ మాట్లాడుతూ ‘‘సినిమా కోసం ఎంతైనా కష్టపడే వ్యక్తుల్లో సాయికిరణ్‌ అడివిగారు ఒకరు. స్ర్కిప్ట్‌ వర్క్‌, షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఆయన చాలా డిడికేషన్‌తో వర్క్‌ చేశారు. నేను మిలటరీ బ్యాగ్రౌండ్‌ నుండి వచ్చాను. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కిన ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భా