HomeTeluguఉగాది నుంచి ‘ఊచకోత’ మొదలంటోన్న హీరో సత్యసుమన్ బాబు

ఉగాది నుంచి ‘ఊచకోత’ మొదలంటోన్న హీరో సత్యసుమన్ బాబు

గ్రామీణ నేపథ్యంలో సినిమా అంటే అనుబంధాల వేదికగా కనిపిస్తుంది. అలాగే అనేక ఎమోషన్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. అలా తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో రాబోతోన్న సినిమా ‘ఊచకోత’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్వచ్ఛమైన టీనేజ్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీ కథ, కథనాలు ఇప్పటి వరకూ చూడని విధంగా సరికొత్తగా ఉండబోతున్నాయి. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఫాదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. టైటిల్ కు తగ్గట్టుగానే యాక్షన్ కంటెంట్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఉగాది రోజున ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రాన్ని జి రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, మీనాక్షి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ఇది. సత్యసుమన్ బాబుకు ఇది హీరోగా రెండో సినిమా. రియలిస్టిక్ కథ, కథనాలతో రాబోతోన్న ఊచకోత చిత్రానికి కథ, మాటలు: కె బాలకిశోర్, సంగీతం: ప్రమోద్ పులిగిళ్ల, సినిమాటోగ్రఫీ: అడపా సతీష్ అందిస్తున్నారు. నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అందించబోతున్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES