నివృతి వైబ్స్ నుంచి వస్తున్న మరో ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ “నువ్వే కావాలి అమ్మ”..

118

మౌనీస్ కుమార్ కల్ల సంగీత సారథ్యంలో సందీప్ సన్ను దర్శకత్వంలో సీనియర్ నటి ఆమని,మానస్ తల్లి, కొడుకులుగా. చేసిన ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ “నువ్వే కావాలి అమ్మ”. ఈ పాటను జ్యోతి కున్నూరు నిర్మించారు. తల్లి, కొడుకులపై చిత్రీకరించిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ ను మా” E.C మెంబర్ శైలజ, సీనియర్ నటి ఆమని, పద్మిని నాగులపల్లి, ఈ సాంగ్ నిర్మాత జ్యోతి కున్నూరు కలసి “నువ్వే కావాలి అమ్మ ” పాటను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. వీరితో పాటు ఇంకా ఈ కార్యక్రమానికి మాదాల రవి, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచె,మదీన్,కాశర్ల శ్యామ్, హీరో సుధాకర్, ఈ సి మెంబెర్ శ్రీనివాస్,కాసర్ల శ్యామ్,శ్రీని ఇన్ఫ్రా శ్రీను, బిగ్ బాస్ ఫెమ్ హారిక, సింగర్ మధు ప్రియ, హాక్సా ఖాన్, తదితరులతో పాటు సాంగ్ చేసిన టీం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి గారు మాట్లాడుతూ.. “నువ్వే కావాలి అమ్మ పాట” నా హార్ట్ కు టచ్ అవ్వడమే కాకుండా ఈ పాట వింటుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది. గజి బిజి పాటలు వస్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకులకు మంచి పాటలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నివృతి నుండి నిర్మాత జ్యోతి గారు బిగ్ రిస్క్ తీసుకొని ముందుకు వచ్చి అమ్మ మీద పాట చేయడం చాలా సంతోషంగా ఉంది. సందీప్ ఈ పాటను చాలా చక్కగా తెరకెక్కించాడు. “నువ్వే కావాలి అమ్మ “పేరుతో వస్తున్న ఈ పాట బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. మదర్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. దర్శకుడు సందీప్ కొత్తవాడైనా మంచి కాన్సెప్ట్ తో అమ్మపై ఇలాంటి మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని చేయడం అనేది మంచి విషయం. ఇందులో నటించిన మా అందరి అభిమాన నటి ఆమని గారు. తన సినిమాలు నాకు ఇన్స్పిరేషన్ కలిగించాయి తను మాస్ సాంగ్స్ చేసినా.. ఫ్యామిలీ రోల్ చేసినా ఇలా ఏ రోల్ చేసినా చాలా చక్కగా ఒదిగిపోయే అద్భుతమైన నటి. అలాంటి ఆమని గారు ఇందులో అమ్మ పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. మానస్ కూడా చాలా బాగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది.నివృతి వైబ్స్ వాళ్లు సినిమా రేంజ్ లో సాంగ్ చేసి ప్రేక్షకులకు అందించడం చాలా మంచి విషయం. పాట చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పాటలు ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రపంచానికి మూలం అమ్మ. అలాంటి అమ్మ పై నివృతి వైబ్స్ వారు మంచి పాట చేశారు.ఇలాంటి ఆల్బమ్స్ ఇంతకు ముందు స్మిత గారు చేశారు. ఇప్పుడు నివృతి వైబ్స్ చేస్తున్నారు.వీరు చేసే సందేశాత్మక పాటల ద్వారా ప్రజలను
చైతన్యవంతులుగా చేసి ఆరోగ్యకరమైన పాటలు అందిస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది అన్నారు.ఇందులో మానస్ చాలా బాగా నటించాడు. అలాగే ఈ పాట కోసం పనిచేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

నివృతి వైబ్స్ నిర్మాత జ్యోతి కున్నూరు మాట్లాడుతూ..మేము అమ్మ పాట చేయాలనుకున్నప్పుడు ముందుగా మాకు ఆమని గారే కనిపించారు. దాంతో మేము వారిని కలిసి అడగగానే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు వారికి మా ధన్యవాదాలు. సందీప్ లాంటి యంగ్ టాలెంట్ ను మనం ఎంకరేజ్ చేయాలి. తన టీం ఈ పాట కోసం చాలా కష్టపడ్డారు. చాలా ట్యాలెంట్ ఉన్న నటుడు మానస్. తను మాతో జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు తనతో మేము చేసిన “జరీ జరీ” సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మానస్ కు జోడీగా విష్ణు ప్రియ అలాగే వీరిద్దరూ చేసిన డాన్స్ ఇలా అన్నీ చాలా చక్కగా కుదిరడంతో ఆ పాట బిగ్గెస్ట్ హిట్ అయింది. మేము ఇంత మంచి పాటలు తీయగలుగుతున్నాం. అంటే అందుకు మా నివృతి టీం హార్డ్ వర్క్ ఎంతో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. మేము తీసిన అమ్మ పాటను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో మానస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవమైన ఈ రోజు “నువ్వే కావాలి అమ్మ” పాట లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆమని గారితో నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నివృతి వైబ్స్ లో నేను చేయాల్సిన మొదటి పాట ‘నువ్వే కావాలి అమ్మ’ . ఈ పాట లిరిక్స్ విన్న తరువాత ఎమోషనల్ అయ్యి ఈ పాట చేయడానికి ఒప్పుకున్నాను. అయితే “జరీ జరీ” పాట ముందు రావడం అది బిగ్ హిట్ అవ్వడంజరిగింది. ఈ పాట నాకు చాలా స్పెషల్. మంచి ఎమోషనల్ గా ఉండే ఈ పాట ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అవుతుంది. ఇలాంటి మంచి సాంగ్ లో నటించే అవకాశం ఇచ్చిన నివృతి వైబ్స్ జ్యోతి గారికి ధన్యవాదాలు.

సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ..ఇలాంటి ఇండ్యూజ్వల్ సాంగ్ చేయడం నాకిదే మొదటిసారి. అమ్మ సెంటిమెంట్ సాంగ్ లో చేయాలని నిర్మాత జ్యోతి చెప్పడంతో ఈ పాట చేయడానికి ఒప్పుకున్నాను. ఆ తరువాత డైరెక్టర్ సందీప్ చూడగానే ఇంత యంగ్ స్టర్ అమ్మ పాటను డీల్ చేయగలుగుతాడా లేదా.. అని డౌట్ పడ్డాను. తర్వాత తను తీస్తున్న షాట్స్ చూసి తనపై నమ్మకం కలిగింది.అలాగే తల్లి కొడుకుల మధ్య ఉన్న స్వీట్ నెస్ ని చాలా చక్కగా చూపించాడు. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది.ఈ సాంగ్ చేసినప్పుడు నాకు సాంగ్ చేస్తున్నట్లు అనిపించలేదు సినిమా చేసినట్టు అనిపించింది.డి.ఓ.పి నానాజీ గారు అందర్నీ చాలా బాగా చూపించాడు.మానస్ చేసిన చేసిన “జరీ జరీ “సాంగ్ చూశాను. చాలా ఎనర్జీటిక్ గా డ్యాన్స్ చేశాడు. దానికి ఆపోజిట్ గా ఉండే ఈ సాంగ్ లో ఎమోషనల్ గా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. తనకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇంత మంచి పాటలు అందిస్తున్న నివృతి వైబ్స్ టీం అందరికీ థాంక్స్ చెప్తున్నాను. నివృతి వైబ్స్ లో వచ్చిన అన్ని పాటలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న “నువ్వే కావాలి అమ్మ” పాట కూడా అన్ని లాంగ్వేజ్ లలో బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. అమ్మ పై ఇలాంటి మంచి సాంగ్ చేసే అవకాశం ఇచ్చిన నివృతి వైబ్స్ వారికి నా ధన్యవాదాలు. వీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో ఈ సాంగ్ బాగా వచ్చింది. సీనియర్ యాక్టర్ ఆమని గారితో చేయడం మొదట భయం వేసినా వారు ఇచ్చిన ధైర్యంతో ఈ సాంగ్ చేయడం జరిగింది. మానస్ ఈ సాంగును చాలా బాగా చేశాడు.పాటకు రంజిత్ చాలా మంచి లిరిక్స్ ఇచ్చాడు.నివృతి వైబ్స్ ఛానల్ ద్వారా విడుదల అవుతున్న ఈ అమ్మ పాట అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

లిరిసిస్ట్ రంజిత్ కుమార్ రిక్కీ మాట్లాడుతూ…సందీప్ గారితో గత నాలుగు సంవత్సరాలనుండి వర్క్ చేస్తున్నాను. ఈ సాంగ్ కోసం నేను చాలా వెయిట్ చేశాను.ఈ సాంగ్ తో మాకు ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు స్క్రీన్ పై ఈ సాంగ్ రాగానే అందరూ చాలా ఎమోషన్ అవ్వడం చూస్తుంటే మేము కూడా ఇంకా అదే వైబ్రేషన్ లో ఉన్నాము. ఆమెను గారి వంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేస్తున్నందుకు మా అమ్మ చాలా సంతోషపడింది. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత జ్యోతి గారికి ధన్యవాదాలు అన్నారు.

హీరో సుధాకర్ మాట్లాడుతూ.. నివృతి వైబ్స్ ద్వారా జ్యోతి గారు ట్యాలెంట్ ఉన్న కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అమ్మ పాట చాలా బాగుంది. తల్లి, కొడుకులు గా చాలా చక్కగా ఒదిగిపోయారు. ఇలాంటి మరెన్నో మంచి పాటలు నివృతి వైబ్స్ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

బిగ్ బాస్ ఫెమ్ హారిక మాట్లాడుతూ..బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నివృతి వైబ్స్ లో మంచి సాంగ్ చేయడం జరిగింది.మా నిర్మాత జ్యోతి గారికి కృతజ్ఞతలు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

నటీ నటులు…ఆమని, మానస్ తదితరులు

సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : నివృతి వైబ్స్
నిర్మాతలు : జ్యోతి కున్నూరు

స్క్రీన్ ప్లే డైరెక్టర్ : సందీప్ సన్ను
మ్యూజిక్ : మౌనీస్ కుమార్ కల్ల
డి. ఓ. పి : నానాజీ కరణం
లిరిక్స్ : రంజిత్ కుమార్ రిక్కీ
ఎడిట్ & డి.ఐ: లక్కీ మీడియా వర్క్స్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్