*ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం ఖరారు*

516

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్ కు వెళుతుంది.

ఈ చిత్రాన్ని 2021 వేసవి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది. ఎప్పటి నుండొ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ అనౌన్స్మెంట్ నేడు అధికారికం గా వెలువడింది. ఇతర నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది .