లేడి లయన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న చిత్రం ఎన్త్ హవర్“. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ హీరో విశ్వకార్తికేయ హీరో గా నటిస్తున్నాడు. కార్తికేయ నటించిన అల్లంత దూరాన, ఐ పి ఎల్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. యువ వ్యాపార వేత్త రాజు గుడిగుంట్ల స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని పూర్తి విభిన్న మైన పాయింట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ : సినిమా లో నటించిన నటి నటులకు టెక్నీషియన్స్ కు నా శుభాకాంక్షలు.సినిమా ఘన విజయం సాధించాలి అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ డైరక్టర్, నిర్మాత రాజు గుడిగుంట్ల, హీరో విశ్వకార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ లంకదాసరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాదెండ్ల సురేష్ బాబు , డి.ఓ.పి. శ్రీ వెంకట్.. పాల్గొన్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.