HomeTeluguనేపోటిజమ్ మూవీ లిరికల్ వీడియో నీ ఆవిష్కరించి మమ్మల్ని బ్లేస్ చేసిన తమ్మారెడ్డి

నేపోటిజమ్ మూవీ లిరికల్ వీడియో నీ ఆవిష్కరించి మమ్మల్ని బ్లేస్ చేసిన తమ్మారెడ్డి


పాపిన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొర్రపాటి వెంకట రమణ సమర్పణలో, విపుల్ దర్శకత్వంలో, వై అనిల్ కుమార్, కే.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం *నేపోటిజం*. వెంకీ, వాసిం,వెంకట్ పొడి శెట్టి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం లిరికల్ వీడియో సాంగ్ ను దర్శక నిర్మాత శ్రీ తమ్మా రెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ: నేపొటిజం ఉన్నమాట వాస్తవమే చాలా మంది హీరోల కొడుకులు, డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా ట్రై చేసారు ఫెయిల్ అయ్యి వెళ్లి పోయారు .అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ తో సూపర్ స్టార్ అయిన వాళ్ళు వున్నారు బేసిక్ గా మన టాలెంట్ ను మనం ప్రదర్శించు కోవాలి దానికి పట్టుదల కావాలి.సిన్సియర్ గా వుండాలి.దానిమీద బేస్ అయ్యి తీశాడు ఎంత సేపు వాళ్ళను వీళ్ళను తిట్ట కుండా తీశాడు టాలెంట్ వుండి సిన్సియర్ గా పనిచేస్తే టాప్ పొజిషన్ కి వస్తారు అని చెప్పేదే ఈ సినిమా అని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసాను మంచి ప్రయత్నం చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా రాకపోయినా నిజంగా టాలెంట్ వుంటే మంచి పొజిషన్ కి వస్తారు. మనల్ని మనం నమ్ముకోవాలి ఇంకొకరి లాగా ఇమిటేట్ చేస్తాము అంటే ఎక్కువకాలం వుండరు.అదే ఈ సినిమా చెపుతుంది.యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు

దర్శకుడు విపుల్ మాట్లాడుతూ: నేపోటిజమ్ మూవీ లిరికల్ వీడియో నీ ఆవిష్కరించి మమ్మల్ని బ్లేస్ చేసిన తమ్మారెడ్డి సార్ కు కృతజ్ఞతలు పుట్టగానే ఎవ్వరూ స్టార్ కారు స్టార్ అవ్వడానికి ఎవరైనా కఠోర శ్రమ చెయ్యాలి అదే ఈ సినిమా లో చూపిస్తున్నాము. దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు

మ్యూజిక్: మేఘవత్
సినిమాటోగ్రఫీ: ఆర్ రాఘవేంద్ర
ఎడిటింగ్: వి నాగిరెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మహావీర్
కొరియోగ్రఫర్: మహావీర్
కో ప్రొడ్యూసర్స్: కొసరాజు శివరామకృష్ణ, కే.కృపాకర్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES