ఆకట్టుకుంటోన్న ‘బాలమిత్ర’లోని ‘వెళ్లిపోమాకే’ సాంగ్

554


విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దకుంటోన్న ఈ చిత్రం నుంచి ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతుండటంతో.. చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఒక చిన్న సినిమాలోని పాటకు ఇంత మంచి ఆదరణ లభించడంతో.. ఈ పాటలాగే సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందనే కాన్ఫిడెంట్‌ని చిత్రయూనిట్ వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత శైలేష్ తివారి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని పెద్ద సినిమాలే కాదు.. ఈ మధ్య వస్తోన్న కొన్ని చిన్న సినిమాలు కూడా నిలబెడుతున్నాయి. అలాంటి జాబితాలోకి మా చిత్రం కూడా చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. అందుకు కారణం రీసెంట్‌గా మా సినిమా నుంచి విడుదలైన ‘వెళ్లిపోమాకే’ సాంగ్‌కు వస్తోన్న ఆదరణే కారణం. రెండు రోజుల క్రితం మధుర ఆడియో ద్వారా విడుదలైన ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో రాబోతోన్న ‘బాలమిత్ర’ కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. పాటని ఆదరించిన ప్రేక్షకులకు, నాకు సహకరించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఫైట్స్: వెంకట్ మాస్టర్,
కొరియోగ్రఫీ: విగ్నేష్ శుక్లా,
ఆర్ట్: భీమేష్,
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి.

Veerababu PRO
9396410101