టైటిల్: మాయగాడు
క్యాస్ట్: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్, అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తది తరులు….
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి
ఎడిటర్: జునైద్ సిద్దిఖ్
ప్రొడ్యూజర్: భార్గవ్ మన్నె
రైటర్ & డైరెక్టర్: జి కార్తిక్ రెడ్డి
నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్స్ గా అడ్డా ఫేం జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్ లో, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. పైరసీ బ్యాక్ డ్రాప్లో రూపొందిన లవ్ స్టోరీ ఇది. తాజాగా, యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: కాకినాడ లో రవి(నవీన్ చంద్ర) అనే వ్యక్తి సినిమాలని పైరసీ చేసే ఒక సిడి షాప్ ఓనర్. ఆకతాయి గా అమ్మాయిలతో తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవి ని పోలీస్ లకి పట్టిస్తుంది. హీరో అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు. ప్లే బాయ్ గా తిరిగే రవి(నవీన్ చంద్ర) లవ్ లో సిరి ఎలా పడింది? మరి పూజా ఝావేరి కి నవీన్ చంద్ర కి సంబంధం ఏంటి? పూజా ఝావేరి అన్నయ్య యాంటోని(అభిమన్యు సింగ్) నవీన్ చంద్ర ని ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అసలు పైరసీ ఆగిందా లేదా? అనేది కథ….
కధనం, విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ ఓపినింగ్ లో నవీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తాడు. సినిమా రీలిజ్ తరువాత పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తూ తిరిగే ఒక ప్లే బాయ్ క్యారెక్టర్. కాకపోతే, ప్లే బాయ్ గా చూపించే క్యారెక్టర్ లో కొన్ని సీన్స్ సాగదీత గా అనిపిస్తాయి. తన ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడ కి వచ్చిన సిరి, పైరసీ చేస్తున్న నవీన్ చంద్ర కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో అతని వలలో చిక్కుకుంటుంది. అదే టైం లో పూజా ఝావేరి నవీన్ చంద్ర కి పరిచయమవ్వుతుంది. తన హాట్ హాట్ అందాలని చూసి హీరో ఫిదా అయ్యిపొగా, తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పిన పట్టించుకోకుండా చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు యాంటోని(అభిమన్యు సింగ్) తన చెల్లితో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోతాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ నిడివి తక్కువే అయ్యిన పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఒక బలమైన సీక్వెన్స్ లో నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేష్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్ అవ్వుతుంది.
సెకండ్ ఆఫ్ లో ప్లే బాయ్ కాస్త లవర్ బాయ్ అయ్యిన తీరు బాగుంటుంది. కాకపోతే, కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో అభిమన్యు సింగ్ చేసే కామిడి నిడివి తక్కువే అయ్యిన కడుపుబ్బా నవ్విస్తుంది. క్లైమాక్స్ లో పైరసీ కోసం ఫ్యాన్స్ తో పోరాటం చేయించిన తీరు బాగున్నప్పటికీ సీన్ పండలేదు. సినిమాలో కథ, కథనం, డైలాగ్స్ మీద ఇంకాస్త గ్రిప్పింగ్ గా దర్శకుడు చేసి ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా సినిమా థియేటర్ లో చూడచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి…
నటి నటుల పెర్ఫామెన్స్: నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ సినిమాలో ఆకతాయి రొమాంటిక్ కుర్రాడు లా, డైలాగ్ డెలివెరి తో బాగా ఆకట్టుకున్నాడు. పూజా ఝావేరి యాక్టింగ్ తో పాటు తన అందచందాలతో స్క్రీన్ మీద వావ్ అనిపించింది. గాయత్రి సురేష్ ట్రేడిషనల్ గా కనిపిస్తూనే తన పాత్ర లో చాలా చక్కగా ఓదిగిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఒక మెంటల్ ఇన్నోసెంట్ కిల్లర్ లా అద్భుతంగా రాణించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ పాత్ర సగటు ఫ్యాన్స్ కి ఉడుకు రక్తం రగిలేలా చేస్తుంది అంత బాగా చేసాడు పెర్ఫామెన్స్. తదితరాలు యాక్టింగ్ బాగానే రాణించారు…
సాంకేతిక విభాగం: దర్శకుడు జి కార్తిక్ రెడ్డి మేకింగ్ అండ్ పాత్రల ఎంపిక విషయంలో బాగానే సక్సెస్ అయ్యిన కథ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలిసింది. కథ లో కొత్తదనం ఏమీ లేకపోయినా కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ గంగాధరి విజ్యువల్స్ ఈ సినిమా స్థాయి పెంచింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఎప్పటి లాగే ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్వాలేదు.
రేటింగ్: 3.25/5
బాటమ్ లైన్: దూసుకెళ్తున్న “మాయగాడు”