సెన్సార్ పూర్తి చేసుకున్న “నమస్తే సేట్ జీ” సినిమా

391

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన
తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా
” నమస్తే సేట్ జీ“.
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ హిరో గా చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలు గా విడుదల అవ్వబోతుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని క్లిన్ “యూ” సర్టిఫికెట్ ని అందుకున్న ఈ సినిమా 80% సింగిల్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ డెవలప్మెంట్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నమస్తే సేట్ జీ సినిమా టీం ని అభినందించారు.

డైరెక్టర్ & హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ కిరాణా షాప్ వారి జీవన విధానాల పైన రూపొందించిన ఈ సీనిమా రెండు పార్టులు గా విడుదల అవ్వబోతుంది, నమస్తే సెట్ జీ పార్ట్ 1 ని రీసెంట్ గా షూట్ చేసాం, ఇది కామెడీ మెస్సేజ్ జోనర్ లో ఉంటుంది, ఈ సినిమా ని 80 % సింగిల్ లొకేషన్ లో షూట్ చేయడం జరిగింది, ఈ సినీమాల్లో స్వప్న చౌదరి,మోన, రేఖ హీరోయిన్లు గా నటించారు. నా టీం సపోర్ట్ వలన సినిమా అనుకున్నట్లు వచ్చింది, కొత్తగా ఉంటుంది అని సింగిల్ లొకేషన్ లొనే సినిమా ని షూట్ చేసాం, ఓపికగా, అర్థం చేసుకుంటే సినిమా చాలా మంది ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.త్వరలో నమస్తే సెట్ జీ పార్ట్ 2 కి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాము. అలానే మా టీం కి శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్న కి ప్రత్యేక ధన్యవాదాలు.

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తమ్ముడు తల్లాడ సాయి కృష్ణ గతం లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా రాష్ట్ర బహుమతి పొంది, తర్వాత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ పొందిన విషయం చాలా సంతోషంగా ఉంది, మరల ఇప్పుడు కిరాణా షాపు వారి జీవన శైలి, ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద ఒక సందేశాత్మక సినిమా ని తీయడం చాలా గొప్ప విషయం, అలానే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది, సెన్సార్ సభ్యులు సైతం సినిమా చూసి అభినందించడం నిజంగా గర్వించదగ్గ విషయం, అలానే తెలంగాణ ప్రభుత్వం యువతకి, ఫిల్మ్ మేకర్స్ ఎల్లప్పుడూ సహకారం గా ఉంటుంది, అలానే మా టూరిజం డెవలప్మెంట్ తరుపున కూడా తమ్ముడు తల్లాడ సాయికృష్ణ కి మరియు ఫిల్మ్ మేకర్స్ కి ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని అని తెలుపుతూ టీం అందరికి శుభాకాంక్షలు.

శోభన్ భోగరాజు, కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ , సుధాకర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి కెమెరా – వివేకానంద విక్రాంత్ ,శివ రాథోడ్, సైదులు,

కథ మాటలు – శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ, సాయి కృష్ణ తల్లాడ

సంగీతం – వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ, లిరిక్స్;- కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, వి.జె.సంధ్యవర్షిని, శరత్ చంద్ర తిరుగానూరి, పబ్లిసిటీ డిజెన్స్- రాహుల్ చిల్లల్లే, ,రాజేష్ బచ్చు, కార్తిక్ కోరుమిల్లి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్-అశోక్ నిమ్మల, విజయ్ నిట్టల,గౌతమ్,

పి.ఆర్.ఓ- పవన్ పాల్