HomeTelugu"నమస్తే సేట్ జీ" సినిమా టైటిల్ లుక్ ని విడుదల చేసిన హీరో సునీల్

“నమస్తే సేట్ జీ” సినిమా టైటిల్ లుక్ ని విడుదల చేసిన హీరో సునీల్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాణంలో తల్లాడ సాయి కృష్ణ, స్వప్న చౌదరి హీరో , హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా ” నమస్తే సేట్ జీ”. తల్లాడ సాయి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ని హీరో సునీల్ విడుదల చేశారు .

ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ “ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు . నమస్తే సేట్ జీ టైటిల్ నాకు బాగా నచ్చింది, హీరో డైరెక్టర్ సాయి కృష్ణ కి తన టీం కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను” అని సునీల్ అన్నారు.

డైరెక్టర్ కమ్ హీరో సాయికృష్ణ మాట్లాడుతూ “మేము అడగానే మా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన హీరో సునీల్ గారికి, నిర్మాత ధీరజ్ గారికి ధన్యవాదాలు. లాక్డౌన్ లో అహర్నిశలు శ్రమించి వాళ్ళ సహాయ సహకారాలు అందించిన డాక్టర్లకి పోలీసులకి మరియు నిత్యా అవసరాల పంపిణి ధారులకి నా ధన్యవాదాలు. కానీ అంతే కష్టపడి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు నిత్యా అవసరాలు అందించిన ” కిరాణా షాప్ ” వాళ్ళు ఉంటారు. ఈ నమస్తే సేట్ జీ సినిమా కిరాణా షాప్ వాళ్ళ కథే. కరోనా సమయంలో సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకుల అందిస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేసింది కేవలం కిరాణా షాప్ వాళ్లే. అందుకోసమే వాళ్ళు చేసిన సేవని గుర్తించి నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాను. అందులో భాగంగానే సాధారణంగా కిరాణా వ్యాపారులని పిలువబడే ఊత పదం ని బేస్ చేసుకొని “నమస్తే సేట్ జీ” అని టైటిల్ ని ఫిక్స్ చేసాం. మా నాన్న కూడా ఒక కిరాణా షాపు వ్యాపారే, ఒక కిరాణా షాపు వ్యాపారి కొడుకు గా నేను తీసే ఈ సినిమా యావత్ కిరాణా షాపు ల నిజ జీవితాలకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాను విడుదల చేస్తాం అని తల్లాడ సాయికృష్ణ అన్నారు.

బ్యానర్ :
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్,
టైటిల్ :
నమస్తే సేట్ జీ,
నిర్మాత :
తల్లాడ శ్రీనివాస్
దర్శకత్వం :
తల్లాడ సాయికృష్ణ,

హీరో , హీరోయిన్ :-
సాయికృష్ణ తల్లాడ ,స్వప్న చౌదరి,శోభన్ బాబు భోగరాజు.

కథ –
రమేష్ కుమార్

రచన పర్యవేక్షణ:
శివ కాకు,

కేమెరా :
ఆర్ ఎస్ శ్రీకాంత్,
శివ సైదులు.

ఎడిటింగ్:
శ్రీకాంత్ కురెళ్లి,

సంగీత దర్శకులు :-
పవన్, వి.ఆర్.ఏ.ప్రదీప్, కార్తిక్ కొడకండ్ల.

లిరిక్స్:-
చింతల శ్రీనివాస్, శివ కాకు,

పబ్లిసిటీ డిజైన్స్ :
కార్తిక్ కోరుమిల్లి

పి.ఆర్.ఓ :
పవన్ పాల్.

Pavan Kumar; 9849128215;Film Reporter

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES