ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది – “నాంది” సక్సెస్ మీట్ లో అల్లరి నరేష్

433

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది సక్సెస్ మీట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, నిర్మాతలు కేఎస్ రామారావు, అనిల్ సుంకర, హీరో సందీప్ కిషన్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

అబ్బూరి రవి మాట్లాడుతూ…కథకు సరైండర్ అయి అంతా పనిచేసిన సినిమా ఇది. అలా చేయడం వల్లే నాంది హిట్ అయ్యింది. దర్శకుడు ఏది చెబితే అది, కథ ఏది డిమాండ్ చేస్తే అది నరేష్ గారు చేశారు. ఈ టీమ్ అంతా సినిమా కోసం ప్రాణం పెట్టే మనుషులు. ప్రతి ఒక్కరూ విజయ్ కు హిట్ కావాలని కోరుకున్నారు. ఇంత విజయాన్ని ఇచ్చి వారికి హాట్సాఫ్. అన్నారు.

స్టోరీ రైటర్ తూము వెంకట్ మాట్లాడుతూ….సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. రాజా, భూపాల్ ఇద్దరూ ఈ కథను దర్శకుడు, నిర్మాత, నరేష్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆర్నెళ్లు కథ మీద వర్క్ చేసి షూట్ కు వెళ్లాం. ఆ వర్క్ అంతా నాంది సినిమా చూస్తున్న వాళ్లు ఫీలవుతున్నారు. నరేష్ గారిని ఎంతో ఇబ్బంది పెట్టాం చిత్రీకరణ టైమ్ లో …నరేష్ గారు అదంతా భరించి సినిమా కోసం పనిచేశారు. అన్నారు.

నిర్మాత సతీష్ మాట్లాడుతూ…మా టీమ్ ను కంగ్రాట్స్ చేసేందుకు వచ్చిన దర్శకులు, నిర్మాతలకు థాంక్స్. నాంది విడుదల పదిరోజుల ముందు నుంచే బాగా పబ్లిసిటీ చేశాం. 19న మరో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. అవి డబ్బింగ్ సినిమాలు. వాటితో టెన్షన్ పడ్డాం. నాంది మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్ గానే ఉన్నాయి. టాక్ బాగుంది కలెక్షన్స్ లేవు అని ఎగ్జిబిటర్స్ చెప్పారు. నైట్ షోస్ కు హౌస్ ఫుల్ అని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇలా ప్రతి చోటు నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన ప్రచారం, పబ్లిక్ మౌత్ టాక్ ద్వారా చాలా మందికి సినిమా గురించి తెలిసింది. అన్నారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ…తెలుగు ప్రేక్షకులకు లైఫ్ టైమ్ రుణపడి ఉంటాను. మీడియా వాళ్లు కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎంత ఎమోషనల్ గా ఉంటానో సినిమాలో చూసి ఉంటారు. నరేష్ గారికి థ్యాంక్స్, కథ చెప్పిన వెంటనే షూటింగ్ కు రెడీ అయ్యారు. కోర్ట్ చాలా సహజంగా ఉంది అంటున్నారు. బ్రహ్మ కడలి గారికి థ్యాంక్స్. ఫొటోగ్రఫీ, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ సూపర్బ్ గా చేశారు. ఆర్టిస్ట్ లు అంతా బాగా నటించారు. మా ఇంటి పేరు నిలబెడుతూ కనకమేడ లాంటి హిట్ ఇచ్చారు. అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ….స్టేజీ మీద చాలా ఈజీగా మాట్లాడుతుంటాను కానీ ఇప్పుడు ఉద్వేగంగా ఉన్నాను. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇంత ప్రేమ దక్కలేదు. ప్రతిభను గౌరవించే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే రాణిలా చూసుకుంటారు అని చెప్పారు. అది నా విషయంలో మరోసారి నిజమైంది. నాంది టీమ్ అందరికీ థ్యాంక్స్. విజయ్ విజన్ ఇవాళ అంతా చూస్తున్నారు. చెన్నైలో షో వేసుకుని చూశాను. అమ్మ రాధిక నాంది సినిమా చూసి ఏడ్చేసింది. సూర్య ప్రకాశ్ క్యారెక్టర్ తో ఎంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కోర్ట్ రూమ్ సీన్స్ సినిమాటిక్ గా లేవు అంటున్నారు. నరేష్ ఒక్కో సీన్ అద్భుతంగా చేసి ఏడిపించారు. అన్నారు

హీరో నరేష్ మాట్లాడుతూ…2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్ ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను. మేము సినిమాలో చెప్పిన సెక్షన్స్ గురించి ఇటీవల ఓ పోలీస్ అధికారి సినిమా చూసి మెచ్చుకున్నారు. చాలా రీసెర్చ్ చేశారు కదా అని ఆయన అడిగారు. విజయ్ కు, రైటర్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను. విజయ్ గారికి చాలా చెక్స్ వచ్చి ఉంటాయి అడ్వాన్స్ లుగా. విజయ్ తో ఒకాయన మాట్లాడుతూ..ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటని అడిగాడట. అప్పుడు విజయ్ కథలో కంటెంట్ ఉండాలి, హీరో టాలెంటెడ్ అయి ఉండాలి సక్సెస్ ఫెయిల్యూర్ తో పనిలేదు అన్నాడట. దేవి ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన మంచి దర్శకుడు అని తెలుసు గానీ ఇంతమంచి నటుడు అని తెలియదు. ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటది. ఆరు నిమిషాల ఒక షాట్ ఉంటుంది, నేను వరలక్ష్మి, ప్రియదర్శి ఆ సీన్ లో చేయాలి. అంత సేపు ఎమోషన్ క్యారీ చేయాలి. చేయగలమా అనుకున్నాం. కానీ సీన్ చేశాక సంతృప్తిగా అనిపించింది. సతీష్ నిర్మాతగా ధైర్యం చేశారు. కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ప్రయోగాత్మక సినిమా ఏంటి అనుకోకుండా కొత్త తరహా సినిమా ప్రయత్నించారు. ఇకపైనా ఇలాంటి డిఫరెంట్ సినిమాలే చేయాలని కోరుతున్నా. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటాను. మరో రెండేల్లు ఇండస్ట్రీ కోలుకోదు అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. అన్నారు.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.

సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
బ్యాన‌ర్‌: ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజేష్ దండా
సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
క‌థ‌: తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
ఫైట్స్‌: వెంక‌ట్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385